ఎక్స్ క్లూజివ్ తుపాకీ ఎగ్జిట్ పోల్స్: మునుగోడులో గెలుపు ఆ పార్టీదే

Update: 2022-11-03 13:30 GMT
మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది.  నియోజకవర్గంలో దాదాపు 90శాతం పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువే పోలింగ్ జరిగింది. ఈసారి భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసినా కూడా కాస్తంత తగ్గడం గమనార్హం. ఇక పోలింగ్ ముగియడంతో నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారన్నది 'తుపాకీ.కామ్' ఎక్స్ క్లూజివ్ గా సర్వే నిర్వహించింది.

నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామం నుంచి తుపాకీ.కామ్ పలువురి అభిప్రాయాలు తీసుకొని సర్వే నిర్వహించింది. ఇందులో సంచలన ఫలితాలు వెలుగుచూశాయి.  తెలుగురాష్ట్రాలే కాదు.. యావత్ దేశమంతా చూసిన మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు అధికార టీఆర్ఎస్ వైపేనని తేటతెల్లమైంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మోహరించి ఆగమాగం చేసిన బీజేపీని ప్రజలు గెలిపించడం లేదని సర్వేను బట్టి అర్థమవుతోంది.

మునుగోడు నియోజకవర్గంలో దాదాపు  90 శాతం పోలింగ్ జరిగింది.. 2 లక్షల మంది ఓటు వేశారు. పోయిన సారి కంటే కాస్తంత ఓటు శాతం తగ్గింది. అయినా కూడా 90శాతం అంటే చాలా ఎక్కువే. భారీగా డబ్బు, మద్యం, బంగారం కూడా పంచిన మునుగోడు దేశంలోనే ఖరీదైన ఎన్నికగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా డబ్బులు ఖర్చుపెట్టి ప్రచారం చేశాయి.

ఈ క్రమంలో తుపాకీ.కామ్ సర్వేలో టీఆర్ఎస్ దే విజయం అని తేలింది. రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది.

ఓట్ల శాతం పరంగా చూస్తే..

- టీఆర్ఎస్ కు 45-46 శాతం
- బీజేపీ కి 36-37 శాతం
- కాంగ్రెస్ 16-17 శాతం
- బీఎస్పీ, ఇతరులు 1-2 శాతం

ఓట్లు సాధిస్తారని తుపాకీ.కామ్ సర్వేలో తేలింది. దీన్ని టీఆర్ఎస్ విజయం ఖాయమన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే తుది ఫలితం మాత్రం ఎన్నికల కౌంటింగ్ నాడే తేలనున్నాయి. ప్రజల నాడిని బట్టి చూస్తే గులాబీ పార్టీదే విజయంగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో మరీ ఈ ఫలితం పునరావృతం అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News