ట్రిపుల్ తలాక్ ఉండాలని తేల్చేసింది

Update: 2016-11-21 07:00 GMT
దేశ వ్యాప్తంగా విస్తృతంగా చ‌ర్చ‌ సాగుతున్న ట్రిపుల్ తలాక్ అంశంపై ముస్లిం లాబోర్డు ఆసక్తికర నిర్ణయాన్ని వెలువరించింది. ఇస్లామిక్ దేశాల్లో సైతం తొలగించిన ట్రిపుల్ తలాక్ కారణంగా.. ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని.. ఈ విధానాన్ని తొలగించాలంటూ పెద్ద ఎత్తున వాదనలు సాగుతున్నాయి. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ ఒక వాజ్యం నడుస్తోంది. ఈ అంశంపై కేంద్రం వైఖరిని వెల్లడించాలని సుప్రీం కోరింది.

ఇదలా ఉంటే.. ముస్లింల విడాకులకు సంబంధించిన ట్రిపుల్ తలాక్ ను కొనసాగించాల్సిందేనని.. ముస్లిం పర్సనల్ లా బోర్డు తేల్చేసింది. రాజకీయంగా లబ్థి పొందేందుకే కేంద్రం ట్రిపుల్ తలాక్ ను.. ఉమ్మడి పౌరస్మృతిని వాడుకుంటుందని మండిపడింది. ఖురాన్ గ్రంథంలోని బోధనలకు అనుగుణంగానే ముస్లిం పర్సనల్ లాను రూపొందించినట్లుగా చెప్పిన బోర్డు.. దివ్యమైన షరియా చట్టాల్లో వ్యక్తులు కానీ న్యాయ వ్యవస్థలు కానీ జోక్యం చేసుకోలేవని స్పష్టం చేయటం గమనార్హం.

ట్రిపుల్ తలాక్ ను తాము సమర్థిస్తున్నట్లుగా వెల్లడించిన బోర్డు.. మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధించిన తీర్మానాన్నిఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ట్రిపుల్ తలాక్ కానీ.. ఉమ్మడి పౌరస్మృతి అంశాల్ని మహిళా విభాగం కూడా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. మరి.. ముస్లిం లాబోర్డు నిర్ణయంపై ఎలాంటి స్పందనలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News