ప్రజలు ఆదివారం వస్తే చాలు సెలవు కావడంతో అందరూ నాన్ వెజ్ తినడం రివాజు. ఈ క్రమంలోనే భారీగా రెట్లు పెంచడంతోపాటు ప్రజల ప్రాణాలతో కొందరు అక్రమార్కులు ఆటలాడుతున్నారు. బెజవాడ రైల్వే స్టేషన్ సాక్షిగా శనివారం దారుణం వెలుగుచూసింది.
విజయవాడ రైల్వేస్టేషన్ లో శనివారం కుళ్లిన మటన్ భారీగా పట్టుబడింది. విశాఖపట్నం, ఢిల్లీ నుంచి వచ్చిన పార్శిల్ బాక్సుల్లో మేక, గొర్రె తలకాయలు, కాళ్లను గుర్తించారు. ఖాదర్ అనే వ్యక్తి పేరు మీద ఈ పార్శిల్ బాక్సులు వచ్చాయని పోలీసులు గుర్తించారు.
కాగా ఖాదర్ విజయవాడ వాసి కాదు.. మచిలీపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తి అని.. పాశ్చిల్ బాక్సులను తీసుకెళ్లడానికి మరొకరు రావడంతో వాళ్లిద్దరిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడ సహా ఒడిశా, బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి కుళ్లిన మాంసం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. విజయవాడతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మేక తలకాయలకు, కాళ్లకు మంచి డిమాండ్ ఉంది. తల ఒక్కంటికి వెయ్యి, కాళ్లు రెండు వరకు 800 రూపాయల వరకు అమ్ముతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో వీటికి తక్కువ ధరకు కొని ఇక్కడికి తీసుకొచ్చి మటన్ మాఫియా అమ్ముతున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల నుంచి ఇలా మటన్ ఎంత బెజవాడకు వచ్చింది. వీటిని ఎవరు తెస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రజలు మాంసం కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ ఘటన వెలుగుచూశాక పోలీసులు సూచిస్తున్నారు.