నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. హైదరాబాద్ వచ్చి మరీ ఏపీ సీఐడీ అధికారులు ఆయన ఇంట్లోకి వెళ్లి రఘురామను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
రఘురామ అరెస్ట్ పై ఆయన కుమారుడు భరత్ స్పందించారు. వారెంట్ లేకుండా తన తండ్రిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. రఘురామకృష్ణం రాజు అరెస్ట్ కు కారణాలు చెప్పకుండా కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు అన్నారని భరత్ చెప్పారు.
ఇక ఎంపీ రఘురామను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని.. అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా? అని భరత్ ప్రశ్నించారు. 'కరోనా కాలంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు? రఘురామకు ఆరోగ్యం కూడా బాగా లేదు. ఇదంతా ఓ స్కెచ్ ప్రకారం జరిగింది. వాళ్లు సీఐడీ ఆఫీసర్ లో.. లేక రౌడీలో అర్థం కావడం లేదు' అని భరత్ వాపోయారు.
కాగా రఘురామ అరెస్ట్ పై కోర్టులో హౌస్ మోహన్ పిటీషన్ దాఖలు చేస్తామని భరత్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని తెలిపారు.