నా పేరు హిట్ లిస్ట్‌లో ఉంది ... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు !

Update: 2020-02-21 12:52 GMT
ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ పలు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే ..తాజాగా మాజీ ప్రజా ప్రతినిధుల సెక్యూరిటీకి సంబంధించి జగన్ సర్కార్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు భద్రతను తొలగించింది.  అయితే , దీని పై ప్రతిపక్ష పార్టీ టీడీపీ జగన్ సర్కార్ పై మండిపడుతుంది. కావాలనే ప్రభుత్వం మా పై కక్ష సాధిస్తుంది అని, మాకు ఏదైనా అయితే ప్రభుత్వం భాద్యత వహిస్తుందా? అని ప్రభుత్వం దీనిపై పునరాలోచించి వెంటనే సెక్యూరిటీని పునరుద్ధరించాలని కోరారు.

ఇక ఈ నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు ఉందంటున్నారు మాజీ మంత్రి కిడారి శ్రవణ్‌కుమార్. తాను మావోయిస్టుల హిట్ లిస్ట్‌లో ఉన్నానని.. విశాఖపట్నం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. హిట్ లిస్ట్‌లో ఉన్న తనకు సెక్యూరిటీ పునరుద్ధరించాలని విన్నవించారు. తనకు ప్రాణభయం ఉందని, గిరిజన ప్రాంతాల్లో తిరగాలంటే సెక్యూరిటీ అవసరమన్నారు. తనకు భ్రదత తొలగించి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని, తనకేదైనా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అంటూ ప్రశ్నించారు. కిడారి శ్రవణ్ కుమార్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మావోయిస్టుల ప్రాభల్యం ఉండటంతో.. తన సెక్యూరిటీని తగ్గిండచంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన తండ్రి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేసిన ఘటనను గుర్తు చేస్తున్నారు.. అందుకే తనకు భద్రతను కొనసాగించాలని కోరుతున్నారు.
Tags:    

Similar News