బహిరంగ మలమూత్ర విసర్జనపై ప్రజల్లో వస్తున్న చైతన్యానికి చక్కటి నిదర్శనంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బూజనూరు గ్రామం. ఈ గ్రామంలో ఒక మంచి సంప్రదాయం ఉంది. కాస్త కఠినమైన సంప్రదాయమైనా దాన్ని మంచిదని ఒప్పుకోక తప్పదు. అంత మంచి నిబంధన మరి. ఇంతకీ అదేంటని అంటారా? మరేదో కాదు.. మీ ఇంట్లో మరుగుదొడ్డి లేకుంటే వంటగది కూడా లేనట్టే అనుకోమంటారు ఆ గ్రామస్తులు. ఇదేం కొత్త ట్విస్టూ! కాస్త అర్ధమయ్యేలా చెప్పండీ.. అంటారా. అక్కడికే వస్తున్నాం. ఈ గ్రామంలో ఎవరికైనా సొంత మరుగుదొడ్డి లేకుంటే ఆ కుటుంబాలకు రేషన్ సరుకులు బందు పెట్టాల్సిందిగా గ్రామకమిటీ తీర్మానం చేసింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది మరి.
మామూలుగా ఎవరిళ్లకు వాళ్లు మరుగుదొడ్లు నిర్మించుకోమని ఎంత మొత్తుకున్నా కొందరి చెవికి ఎక్కనేలేదు. దీంతో వీళ్లకిలా కాదని చెప్పి మరుగుదొడ్డి కట్టించుకోని వాళ్లకు రేషన్ బంద్ పెట్టేశారు. తమకు మాత్రమే రేషన్ ఎందుకివ్వడం లేదో తెలుసుకునే ప్రయత్నం కొందరు చేశారు. డీలర్ ను అడగ్గా అడగ్గా తెలిసిందేంటంటే మరుగుదొడ్లు లేని వాళ్లకు రేషన్ ఇవ్వొద్దని గ్రామ ఉపసర్పంచ్ చెప్పారు కాబట్టి ముందా పనిచేయండి తర్వాత రేషన్ కి రండని తెగేసి చెప్పాడు.ఇక్కడితో లైన్ క్లియర్
తమకు రేషన్ ఎందుకివ్వడం లేదో తెలిసి సంతోషించేలోపు కొత్త సమస్య వచ్చి మీద పడిందా గ్రామస్తుల మీద. అదే నీటి కరవు. ఒక మరుగుదొడ్డి కట్టాలంటే మాటలా..! తాగునీటికే దిక్కులేదురా దేవుడా అంటే మరుగుదొడ్డి కట్టుకోవడమా? సరే ఎలాగోలా ట్యాంకర్లను తోలి కట్టామే అనుకోండి.. దాని నిర్వహణకు బండెడు నీళ్లు కావాలి ఎక్కడ్నించి తేవాలీ? అని ప్రశ్నిస్తుంటే కమిటీకి ఏం చెప్పాలో పాలు పోవడం లేదట.
అంతే కాదు గతంలో మరుగుదొడ్లు కట్టుకున్న కుటుంబాలకు ఇంత వరకు బిల్లులు తిరిగి రాలేదు. ఇంత నీటి కరువులో మరుగుదొడ్డి కడితే ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఈ డబుల్ ఖర్చు ఎవరిస్తారు..? ముందు గ్రామానికి సరిపడా నీళ్లివ్వండి.. తర్వాత మరుగుదొడ్డి నిర్మిస్తాం.. అని అడుగుతుంటే అటు వైపు సర్పంచ్ బృందం నుంచి చప్పుడు లేదు. సవాల్ కి సవాల్ ఎదురయ్యే సరికి షాక్ ఇటే కాదు అటు కూడా తగిలినట్టైంది. త్వరలో ప్రభుత్వ పెద్దలకు మొరపెట్టుకునేందుకు గ్రామ కమిటీ సభ్యులు రెడీ అయిపోతున్నారు.