ఆ మద్య బాలకృష్ణ గతంలో తన అన్న - తమ్ముడుపై చేసిన వ్యాఖ్యలకు తన కామెంట్స్ అంటూ ఆరు వీడియోలను విడుదల చేసిన నాగబాబు ఒక్కో వీడియోలో బాలకృష్ణను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ - ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. నందమూరి వర్సెస్ మెగా వార్ నాగబాబు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో మరింతగా ముదిరిన విషయం తెల్సిందే. చివరి వీడియోలో బాలకృష్ణ మరోసారి హిందూపురం నుండి ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడో నేను చూస్తానన్నట్లుగా నాగబాబు కామెంట్ చేశాడు. బాలకృష్ణ తన వారిపై మళ్లీ వ్యాఖ్యలు చేస్తే నేను స్పందిస్తానంటూ వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టిన నాగబాబు గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు షురూ చేశాడు.
నాగబాబు తన వ్యక్తిగత యూట్యూబ్ అకౌంట్ ద్వారా రాజకీయాలపై తన అభిప్రాయం, కొందరు రాజకీయ నాయకులపై తనకున్న అభిప్రాయంను చెప్పేందుకు యూట్యూబ్ ను ఎంపిక చేసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాను చేయబోతున్న విమర్శలు పూర్తిగా తన వ్యక్తిగతం అంటూ అన్న, తమ్ముడికి ఇందులో ఎలాంటి సంబంధం లేదని ముందే ప్రకటించాడు. తనకున్న ఆసక్తితో యూట్యూబ్ లో మై ఛానెల్ నా ఇష్టం అనే ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. మై ఛానెల్ నా ఇష్టం అని పేరు పెట్టినంత మాత్రాన నేనేం నోటికి వచ్చినట్లుగా - వ్యక్తిగతంగా ఇతరులను దూషించను అని, ఎవరిపై పడితే వారిపై విమర్శలు చేయనంటూ క్లారిటీ ఇచ్చాడు. రాజకీయ పరమైన విమర్శలు చేస్తాను తప్ప వ్యక్తిగతంగా మాత్రం ఎవరిని విమర్శించనంటూ చెప్పుకొచ్చాడు.
ఇందులో తాను ఫన్ జనరేట్ చేస్తాను తప్ప, ఎవరిని ఇది ఇబ్బంది పెట్టడానికి కాదన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. ఒక్కో వీడియోలో ఒక్కో వ్యక్తిని ఎంపిక చేసుకుంటానంటూ చెప్పుకొచ్చిన నాగబాబు తన మొదటి వీడియోలో ఏపీ మంత్రి, తెలుగు దేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ను ఎంపిక చేసుకున్నాడు. తాను చిన్నప్పుడు పిల్లలు దేవుడు చల్లని వారే అంటూ పాట వినేవాడిని, ఎందుకంటే పిల్లలు అస్సలు అబద్దాలు ఆడరు. పిల్లలకు అబద్దాలు అనేవి తెలియదు. ఈ పిల్లాడు ఏం మాట్లాడాడో ఒక సారి చూడండి అంటూ.. 'మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎలాంటి అవినీతి, బంధుప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగు దేశం పార్టీయే' అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను చూపించాడు.
చూశారు కదా - ఆ పిల్లాడు ఎంత బాగా మాట్లాడాడో - నిజాన్ని నిర్బయంగా ఒప్పుకునే దమ్ము తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎవ్వరు లేరు లోకేష్ బాబు గారు - మీరు గ్రేట్ అంటూ నాగబాబు ఫన్నీ కామెంట్స్ చేశాడు. లోకేష్ తో మొదలైన ఈ వీడియోలు ముందు ముందు మరెన్ని వీడియోలు వస్తాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగబాబు ఎన్నికల ముందు ఈ హడావుడి ఏంటని కొందరు పెదవి విరుస్తున్నారు.
Full View