జూన్ 1న కేసీఆర్ అసమర్థత బయటపడుతుందా?

Update: 2016-04-08 04:53 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించాలంటే గ్లామర్ ఉన్న నేతలు మాత్రమే సరిపోరు గ్రామరు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే.. తానేం చేసినా పూసగుచ్చినట్లుగా చెప్పటంతో పాటు.. తన వాదనను ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా చెప్పటం కేసీఆర్ కు ఉన్న బలంగా చెప్పొచ్చు. ఆయన చెప్పే మాటలు విన్నప్పుడు.. ఆయన్ను పూర్తిగా వ్యతిరేకించే వారు సైతం కన్వీన్స్ అయ్యేలా ఆయన మాటలు ఉంటాయి. మరో విషయం ఏమంటే.. ఆయన ఏదైనా విషయం మీద మాట్లాడితే సాధికారికంగా మాట్లాడతారే తప్పించి.. ఏదో మాట్లాడమంటే మాట్లాడామన్నట్లుగా ఉండదు.

ఈ మధ్యన తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల  మీద అసెంబ్లీలో మూడుగంటలకు పైగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో అదరగొట్టిన కేసీఆర్ కారణంగా.. ఇరిగేషన్ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన వచ్చిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ను తప్పు పడుతున్న విపక్షాలు.. నాలుగు రోజులు హడావుడి చేసి ఆ విషయాన్ని పక్కన పెట్టాయి.

అయితే.. ఇప్పుడు అదే విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు మాజీ మంత్రి.. బచావో తెలంగాణ మిషన్ చీఫ్ నాగం జనార్దనరెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేసీఆర్ వాదనతో పాటు.. సీఎంగా ఆయన పని తీరును ఎండగట్టాలని నాగం ఆరాటపడుతున్నారు. ఇందుకోసం జూన్ 1న కేసీఆర్ అనుభరాహిత్యాన్ని తాను బయటపెడతానంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుభవ రాహిత్యం.. అసమర్థతపై జూన్ 1న పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తానని వెల్లడించారు. మరి.. నాగం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏ తీరులో ఉంటుందో చూడాలి. కేసీఆర్ పాలనపై ఆయన దుయ్యబట్టినా.. ఆయనిచ్చే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రజల్లోకి ఎంతమేర వెళుతుందో చూడాలి..?
Tags:    

Similar News