ఆ విష‌యంలో ప‌వ‌న్‌, జ‌గ‌న్ కంటే బాబుదే దూకుడా ?

Update: 2022-01-26 13:30 GMT
అన్నీ రాజ‌కీయంగా చూడ‌లేం. కానీ.. ప్ర‌స్తుత ప‌రిస్థితి మాత్రం అన్నీ రాజ‌కీయంగా చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మేమే ముందు.. అనే మాట కోసం.. మీడియాలోను.. సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌చారానికి ప్రాధా న్యం ఇస్తున్నారు. ఎందుకంటే.. ఎవ‌రు ముందుంటే.. వారికే క‌దా స‌హ‌జంగానే ఫాలోయింగ్  ఉంటుంది. సో.. అందుకే నాయ‌కులు ప్ర‌తివిష‌యంలోనూ పోటీ ప‌డుతున్నారు. రాజ‌కీయంగా ఈ దూకుడు ఉండాల్సిందే. అయితే.. అన్ని విష‌యాల్లోనూ.. ఉండాలా? అనేది మేదావుల మాట‌. ఈ పోటీ ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ లు ముందున్నార‌ని.. చెబుతున్నారు. ట్విట్ట‌ర్‌లో జోరుగా ఉన్న నాయ‌కుల్లో ప్ర‌తిప‌క్ష‌ నేత చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌లేరు. ఈ క్ర‌మంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ కూడా ట్విట్ట‌ర్‌లో ముందు నిలిచి.. చంద్ర‌బాబును ప‌క్క‌కు నెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. ఇది కొన్నాళ్లు బాగానే న‌డిచిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత మాత్రం ఎందుకో వెనుక‌బ‌డ్డారు.

ఇక‌, బాబు మాత్రం జోరుగా ముందున్నారు. అయితే.. ఒక్కొక్క‌సారి ఇది వివాదానికి కూడా కార‌ణంగా మారుతోంది. కొన్నాళ్ల కింద‌ట‌... ఒక ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు.. మ‌ర‌ణించారు. అయితే.. ఆయ‌న మ‌ర‌ణించ‌కుండానే.. ఒక మీడియాలో హాట్ టాపిక్ వ‌చ్చింది. బ్రేకింగ్ చూసిన చంద్ర‌బాబు దీనిని క‌న్ఫ‌ర్మ్ చేసుకోకుండానే.. పోటాపోటీగా ఆఘ‌మేఘాల‌పై స్పందించారు. వెంట‌నే ట్విట్ట‌ర్‌లో ఆ నేత‌.. ఫొటోతో సంతాపం తెలిపేశారు. అయితే.. ఇది బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న బాగానే ఉన్నా రంటూ.. మ‌ళ్లీ అదే చాన‌ల్ ప్ర‌క‌టించింది. దీంతో చంద్ర‌బాబు తాను చేసిన‌.. ట్వీట్‌ను వెంట‌నే డిలీట్ చేశారు.

ఇక‌, ఇదే విష‌యంలో అటు ప‌వ‌న్ కానీ, ఇటు జ‌గ‌న్ కానీ.. ఎవ‌రూ ట్వీట్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నా ర్హం. మ‌రోవైపు.. జాతీయ పండుగ‌లైన‌.. స్వాతంత్ర దినోత్స‌వం వంటివి జ‌రిగితే.. తెల‌తెలవారుతూనే.. చంద్ర‌బాబు స్పందిస్తే.. జ‌గ‌న్ తీరిగ్గా మ‌ధ్యాహ్నం 11 గంట‌ల‌కు స్పందిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనిని గ‌మ‌నిస్తున్న కొంద‌రు నాయ‌కులు దీనిలోనూ మ‌న‌కు పోటీ ఎందుకు అనే కామెంటట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News