ఏపీలో రాజకీయం అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్యనే ఈ రోజుకీ కూడా కేంద్రీకృతమై ఉంది. జగన్ని దించాలంటే బాబే కదలి రావాలన్న మాట అయితే జనాలలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అంటే జగన్ తరువాత బాబు పేరునే జనాలు చెబుతారు. అంటే ఈ ఇద్దరు మధ్యనే ఏపీ పాలిటిక్స్ రెండుగా చీలిపోయి ఉంది అన్న మాట.
ఇదిలా ఉండగా చంద్రబాబు ఇక ఊరుకోను అంటున్నారు. క్యాడర్ విషయంలో ఆయన ఇప్పటికే సకల జాగ్రత్తలు చెప్పి ఉంచారు, కొందరు నాయకులకు హెచ్చరికలూ జారీ చేశారు. ఇలాగైతే పార్టీ బండి కదలదు తమ్ముళ్ళూ అంటూ స్వీట్ వార్నింగులూ ఇచ్చేశారు. ఒక విధంగా బాబు గత కొంతకాలంగా మంగళగిరి పార్టీ ఆఫీసులో సమీక్షలు చేస్తూ వచ్చారు. మొత్తం ఏపీలోని 13 జిల్లాలలో పార్టీ పరిస్థితి మీద ఆయనకు పూర్తి అవగాహన వచ్చేసింది.
అంతే కాదు ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరు ఇళ్ళలో పడుకుంటున్నారు అన్న దాని మీద బాబుకు పక్కా క్లారిటీ ఉంది. దీంతో పాటు ఖాళీగా ఉన్న నియోజకవర్గాలలో ఇంచార్జిలను నియమించుకుని మరీ బాబు ముందుకు కదులుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రెండేళ్లకు ముందే బాబు యుద్ధానికి సిద్ధమవుతున్నారు అన్న మాట. ఇక సమీక్షలు సమావేశాలు పూర్తి అయ్యాయి. ఇక ఆఫీసులలో మీటింగులకు చెక్ చెప్పేసినట్లే. అలా నేరుగా వెళ్లాల్సింది జనాల్లోకే అని బాబు గట్టిగా డిసైడ్ అయ్యారని చెబుతున్నారు.
నిజానికి టీడీపీ ఓడిపోయిన తరువాత 2019లో తొలి ఆరు నెలలూ చంద్రబాబు జిల్లాల టూర్లు వేశారు. పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటూ పలు చోట్ల సమీక్షలు కూడా చేశారు. అలాగే మూడు రాజధానులు అని నాడు జగన్ అంటే దాని మీద కూడా ప్రజల వద్దకు వెళ్లారు, కొన్ని సభలూ జరిగాయి. అయితే మధ్యలో వచ్చిన కరోనా మొత్తం టీడీపీ ప్లాన్స్ ని తల్లకుందులు చేసి పారేసింది.
దాంతో చంద్రబాబు పూర్తిగా జూమ్ మీటింగులకు పరిమితం అయ్యారు. అలా కొన్నాళ్ళ పాటు పార్టీ యాక్టివిటీని లాగించారు. ఇక రెండవ దశ కరోనా తగ్గిన తరువాత మంగళగిరి ఆఫీసులో కూడా ఆయన రెగ్యులర్ గా అటెండ్ అవుతూ క్యాడర్ కి భరోసా ఇస్తూ వచ్చారు. ఇపుడు కరోనా ప్రభావం బాగా తగ్గింది, ఇదే మంచి తరుణం, జనాల్లోకి వెళ్లాలని బాబు భావిస్తున్నారు.
మంచి ముహూర్తం చూసుకుని బాబు జిల్లాల టూర్లు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే జగన్ మూడేళ్ల పాలన పూర్తి అయ్యాకనే బాబు టూర్లు ఉంటాయని అంటున్నారు. ఈ మధ్యలో జిల్లాలలకు వచ్చి అక్కడ పార్టీ నేతలతో సమావేశాలు వంటివి ఉంటాయని అంటున్నారు. ఇపుడు బాబు జగన్ శిబిరం వైపే చూస్తున్నారు.
మూడేళ్ల పాలన తరువాత జగన్ మంత్రి వర్గాన్ని ఎటూ విస్తరిస్తారు, దాంతో వచ్చే అసంతృప్తి, అలాగే కొత్త జిల్లాల మీద ఉన్న ఆవేదన, ఆవేశం, వీటికి తోడు మూడేళ్ళుగా ప్రభుత్వ పాలనలో చూసిన వైఫల్యాలు అన్నీ కలసి బాబుకు మంచి సబ్జెక్ట్ గా ఉంటాయని అంటున్నారు.
రోడ్ షోలతో పాటు వీలైన చోట్ల బహిరంగ సభలను కూడా నిర్వహిస్తూ చంద్రబాబు రానున్న రెండేళ్ల కాలంలో జనంలోనే ఉంటారని అంటున్నారు. ఒక విధంగా జగన్ సర్కార్ సంగతిని ఆయన జనంలో ఉండే తేల్చుకుంటారు అని చెబుతున్నారు. రాజు వెడలే రభసకు అన్న తీరున చంద్రబాబు మొత్తానికి మొత్తం అన్ని ఆయుధాలు సమకూర్చుకుంటూ జనంలోకి వస్తున్నారు. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా జగన్ పాలన మీద జనంలో యాటీ వేవ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఎన్నిక వేళకు అది తనకు సులువు అవుతుంది అన్నదే బాబు మార్క్ వ్యూహంగా ఉంది అంటున్నారు.