మాటల్లో తప్పులు దొర్లటాన్ని కాస్త అర్థం చేసుకోవచ్చు. తన తెలుగు విషయం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న వేళ.. దానిపై ఏపీ మండలి సాక్షిగా వివరణ ఇచ్చుకున్నారు మాజీ మంత్రి లోకేశ్. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. మంత్రి అనిల్ తో జరిగిన మాటల యుద్ధం సందర్భంగా శ్రుతిమించినట్లుగా తీవ్రమైన ఆరోపణలు చేశారు లోకేశ్.
నెల్లూరు రౌడీ అని గూగుల్ లో కొడితే మంత్రి అనిల్ ఫోటో వస్తుందని ఆయన పేర్కొన్నారు. లోకేశ్ లాంటి మేధావి.. అమెరికాలో చదువుకొని వచ్చినోడు కదా.. ఆయన నోట్లో నుంచి మాట వస్తే ఎంతవరకూ నిజమన్న విషయాన్ని చెక్ చేసేందుకు గూగుల్ లో కొడితే.. వచ్ఛిన ఫలితం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
నెల్లూరు రౌడీ అని తెలుగులో కానీ ఇంగ్లిషులో కొట్టినా ఫలితం మాత్రం వేరుగా ఉండటం విశేషం. గూగుల్ 'అన్నీ' (ALL) విభాగంలో ఏవేవో వీడియోలు రాగా..బాగా కిందన.. మండలిలో లోకేశ్ అన్న మాటల వీడియో ఒకటి కనిపించింది. ఇక.. ఫోటోల విభాగంలోనూ పై వరుసల్లో మంత్రి అనిల్ ఫోటో లేకపోగా.. టీవీ యాంకర్ ఫోటోలు.. మరేదో ఉన్నాయి. గూగుల్ భగవద్గీత కాకున్నా.. ఇవాల్టి రోజుల్లో ప్రతిదానికి గూగుల్ ను వెతకటం అలవాటైన నేపథ్యంలో లోకేశ్ ఇలా మాట్లాడి ఉంటారని అనుకోవచ్చు.
కాకుంటే.. ఆయన చెప్పినట్లుగా నెల్లూరు రౌడీ అని టైప్ చేసి సెర్చ్ చేశాక.. మంత్రి అనిల్ ఫోటో కనిపిస్తే సర్లే అనుకోవచ్చు. అందుకు భిన్నంగా మంత్రి ఫోటో ఎక్కడో చివర ఉండటం ఒక ఎత్తు అయితే.. సంబంధం లోని వ్యక్తులు ఎందరి ఫోటోలో అందులో కనిపించటం.. అందులోని కొందరైతే సమాజంలో చక్కటి ఉద్యోగాలు చేసుకునే మహిళా యాంకర్ల ఫోటోలు ఉండటాన్ని లోకేశ్ బాబు గుర్తించారా? మాటల్లో తడబాటుకు ఇచ్చిన వివరణ ఓకే. కానీ.. గూగుల్ పేరు చెప్పి ఏదేదో చెప్పేస్తే అభాసుపాలు అవుతారన్న విషయాన్ని లోకేశ్ గుర్తిస్తే మంచిది.