చినబాబుగా అందరికి సుపరిచితుడైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించినట్లుగా కనిపించదు. అలాంటిది పవన్ మాట లోకేశ్ నోటి నుంచి రావటం ఏమిటన్న ఆశ్చర్యం అక్కర్లేదు. నాలుగు రోజుల క్రితం పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చిన మాటల్ని యథాతధంగా కాకున్నా.. దాదాపుగా అలాగే లోకేశ్ మాట్లాడటం విశేషం.
పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మెగా అక్వాఫుడ్ పార్క్ ఇష్యూపై బాధితులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవటం.. వారికి భరోసాను ఇస్తూ.. అక్కడ జరుగుతున్న ఆందోళనలో న్యాయం ఉందంటూ పవన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పటం తెలిసిందే. అక్వాఫుడ్ పార్క్ ఇష్యూపై మీడియాలో మాట్లాడుతున్న సందర్భంగా.. కులాల గురించి ప్రస్తావించారు పవన్ కల్యాణ్.
రాజకీయ నాయకులు.. అందునా పార్టీ అధినేతలుగా ఉండే వ్యక్తుల నోటి నుంచి ప్రజా సమూహంలో కులాల ప్రస్తావన రాదు. వచ్చినా అదేదో కొత్త హామీకి సంబంధించిందే ఉంటుంది తప్పించి.. కులాల మధ్య గొడవలకు సంబంధించిన అంశాల్ని ప్రస్తావించరు. ఇందుకు భిన్నంగా పవన్ కల్యాణ్ కులాల ప్రస్తావన తీసుకొచ్చి.. కొందరు కులాల మధ్య చిచ్చు పెట్టాలని భావిస్తున్నారని.. దీని కారణంగా వాతావరణం కలుషితం కావటమే కాదు.. ప్రజల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బ తినే ప్రమాదం ఉందని.. కులాల మధ్య చిచ్చు రేపటానికి జరుగుతున్న కుట్రను గుర్తించి.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.
అయితే.. పవన్ నోటి నుంచి వచ్చిన ఈ కీలక అంశం ప్రింట్ మీడియాలో కనిపించలేదు. టీవీల్లో లైవ్ చూసిన వారికి.. కొన్ని ఛానళ్లు మాత్రం ఈ వ్యాఖ్యల్ని జాగ్రత్తగా కట్ చేసి మరీ.. తమ న్యూస్ బులిటెన్లలో టెలికాస్ట్ చేశాయి. శనివారం ఇది జరిగితే.. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్.. తమ కుటుంబ ఆస్తుల వివరాల్ని ప్రకటించే సందర్భంగా పవన్ చెప్పిన విషయాల్నితనదైన శైలిలో ప్రస్తావించటం కనిపిస్తుంది. కులాల మధ్య గొడవ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని..ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని ఆయన తన మాటలుగా చెప్పుకొచ్చారు. ఒక ముఖ్యమంత్రి కుమారుడు స్వయంగా కులాల పేరుతో గొడవలు సృష్టించే కుట్ర జరుగుతుందన్న మాట చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం వ్యవధిలో ఇద్దరు ముఖ్య నేతల నోటి నుంచి కులాలకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు వినిపించటం దేనికి సంకేతం..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/