చినబాబు రాజకీయాల్ని విడిచి పెట్టాలంటే..?

Update: 2016-02-25 13:41 GMT
గతంలో రాజకీయ నాయకులు విమర్శలు చేస్తే దానికో ప్రజాప్రయోజనం ఉండేది. ఒకవేళ ఏదైనా ఆరోపణ చేస్తే.. ఆ మాట అనే ముందు ఎంతో ఆలోచించి కానీ మాట అనేవారే తప్పించి తొందరపడి అనేందుకు సాహసించేవారు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే జనాల్లో చులకన అవుతామన్న భయం ఉండేది. ఇప్పుడలాంటి ఫీలింగ్స్ రాజకీయ నేతల్లో బాగా తగ్గిపోయాయి. చర్మం దళసరిగా కావటమో.. ఎవరేం అనుకుంటే మనకేం.. మనం చేయాల్సింది చేసేద్దామన్న బరితెగింపు కానీ.. వారి నోటి నుంచి ఇష్టారాజ్యంగా మాట్లాడే పరిస్థితి.

దూకుడు రాజకీయాలు షురూ అయ్యాక ఎంతటి మాటనైనా ఇట్టే అనేయటం ఒక అలవాటుగా మారింది. ఇక.. సవాళ్ల విషయంలోనూ అంతే. ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద సవాళ్లు చేసుకోవటం ఈ మధ్య బాగా పెరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ బాబు తాజాగా చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ హెరిటేజ్ సంస్థపై ఆరోపణ చేసే వారు.. తనపై చేస్తున్న ఆరోపణల్ని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ సవాలు విసిరారు.

ఇటీవల పార్టీలో చేరుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలంతా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి పార్టీలో చేరుతున్నట్లుగా లోకేశ్ వెల్లడించారు. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పై తీవ్రంగా విరుచుకుపడిన లోకేశ్... ఆయన్ను దొంగబ్బాయ్ గా అభివర్ణించటం విశేషం. ఇంతకూ లోకేశ్ రాజకీయాలకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలో అర్థమైందా..?
Tags:    

Similar News