ఇద్దరు మహానేతల వారసుల్ని పోల్చటం ప్రజలకు మామూలే. ఈ లెక్కన దివంగత మహానేత వైఎస్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ తో కంపేర్ చేయటం చాలామంది చేస్తుంటారు. జగన్ కున్న దూకుడు లోకేశ్ లో కనిపించదన్న విమర్శ కూడా వినిపిస్తారు. అయితే.. లోకేశ్ లో ఉన్న కూల్ నెస్.. జగన్ లో మిస్ అయ్యిందన్న వాదనను మాత్రం ఒప్పుకోరు. జగన్.. లోకేశ్ ఇద్దరి విషయానికి పోలికలు తీసుకొచ్చినప్పుడు..ఎవరికైనా అర్థమయ్యేది ఒక్కటే.. ఇద్దరూ పూర్తిగా భిన్నధ్రువాలుగా చెప్పక తప్పదు.
ఇద్దరి మధ్య పోలిక ఏమైనా ఉందంటే.. అది కేవలం రెండు పార్టీల ముఖ్యనేతల వారసులన్నది ఒకటైతే.. ఇద్దరూ రాజకీయాలకు ముందు బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారే. ఈ రెండు పోలికలు తప్పించి.. మిగిలినవేమీ కలవవనే చెప్పాలి. తాజాగా విజయవాడలో నిర్వహించిన తెలుగదేశం పార్టీ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న లోకేశ్.. తనకూ జగన్ కు మధ్యనున్న తేడాల్ని వివరించే ప్రయత్నం చేశారు.
తనకు.. తన తండ్రి మధ్యన విభేదాలు ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారంలో అర్థం లేదన్న లోకేశ్.. జగన్ పై కొన్నివిమర్శలు చేశారు. జగన్ మాదిరి చిన్నాన్నతో రాజీనామా చేయించి పదవులు దక్కించుకోవాలని తాను అనుకోనని.. అలాంటి ఆలోచనలు తనకు రావని వ్యాఖ్యానించారు. జగన్ చేసినట్లుగా తండ్రికి తలవంపులు తెచ్చే పనిని తాను ఎప్పుడూ చేయనని చెప్పిన లోకేశ్.. జగన్ పత్రికలో జరిగేదంతా దుష్ప్రచారమని.. ఆ మీడియాలో వచ్చిన వార్తల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. మిగిలిన మీడియా సంస్థల్లో వచ్చే పాజిటివ్ వార్తల్ని తీసుకుంటే సరిపోదని వ్యాఖ్యానించారు. తేడా పేరుతో జగన్ ఇమేజ్ ను ఎంత దెబ్బ తీయాలో అంత చినబాబు చేసేశారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/