చినబాబుకు పాలిటిక్స్ ఫుల్ టైమ్ అంట

Update: 2016-10-19 17:30 GMT
చినబాబుకు సుపరిచితుడైన లోకేశ్ పేరు చెప్పిన వెంటనే.. అటు రాజకీయాలు.. ఇటు హెరిటేజ్ వ్యవహారాలు రెండింటినీ చూస్తారన్న భావన కలుగుతుంది. ఇందుకు తగ్గట్లే ఆయన పనితీరు ఉంటుందని చెబుతారు. కానీ.. హెరిటేజ్ కంపెనీ వ్యవహారాలు తాను చూడటం లేదన్న విషయాన్ని తాజాగా వెల్లడించారు లోకేశ్. ప్రతిఏటా తమ ఆస్తుల ప్రకటనను ప్రతి ఏటా సెప్టెంబర్.. అక్టోబర్ మొదటి వారాల్లో ప్రకటించటం అనవాయితీగా వస్తున్నదే. తాజాగా ఈ ఏడాది కూడా తమ ఆస్తుల వివరాల్ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ వెల్లడించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హెరిటేజ్ వ్యవహారాల్నితాను చూడటం లేదని.. అమ్మ.. బ్రహ్మి చూస్తున్నారని.. రోజు వారు దాని కోసం చాలా కష్టపడుతున్నట్లుగా చెప్పారు. ‘‘హెరిటేజ్ వ్యవహారాలు అమ్మా.. బ్రహ్మి చూస్తారు. రోజూ వారు చాలా కష్టపడతారు. నిరంతరం ఫ్యాక్టరీలకు వెళ్లటం.. పనుల్ని చూడటం చేస్తుంటారు. నేను పార్టీ వ్యవహారాలు చూస్తున్నాను. నేను ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నాను’’ అని వెల్లడించారు. సో.. చినబాబు ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వచ్చేశారన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News