జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని నడిపించిన చినబాబు నారా లోకేష్.. ఫలితాలపై స్పందించాడు. మరీ వివరంగా మాట్లాడకుండా ట్విట్టర్లో ఒక చిన్న ట్వీట్ తో తన రెస్పాన్స్ తెలియజేశాడు తెలుగుదేశం యువనేత. ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. అభివృద్ధే మా అజెండా. ఇప్పటికీ దాని కోసమే ప్రజల తరఫున పోరాడతాం’’ అని ట్వీట్ చేశాడు లోకేష్.
అంతకుమించి టీఆర్ఎస్ ఘన విజయం గురించి కానీ.. తెలుగుదేశం-భాజపా కూటమికి ఎదురైన పరాభవం గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు లోకేష్. ఇలాంటి సందర్భాల్లో ప్రేలాపనలకు పోకుండా ఓటమి ఒప్పుకోవడమే హుందాగా అనిపిస్తుంది. లోకేష్ అదే పని చేసి గౌరవాన్ని నిలుపుకున్నాడు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అటు టీఆర్ఎస్, ఇటు టీడీపీ పార్టీలు ఇద్దరు యువ నేతలకు సారథ్యం అప్పగించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తనయుడు కేటీఆర్ అద్భుతమైన విజయాన్ని అందుకుంటే.. చంద్రబాబు తనయుడు లోకేష్ దారుణమైన పరాభవాన్ని చవిచూశాడు. ఐతే ఓటమికి నాదే బాధ్యత తరహా వ్యాఖ్యలేమీ చేయకుండా తెలివిగా వ్యవహరించాడు లోకేష్.