ఎమ్మెల్యే ఆళ్లపై లోకేశ్ ఐటీ దాడులు చేయిస్తారా?

Update: 2017-07-13 12:16 GMT
వైసీపీ ఎమ్మెల్యే ఆల్ల రామకృష్ణారెడ్డి అధికార టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. రాజధాని భూముల సమీకరణపై ప్రజల తరఫున పనిచేసిన ఆయన ఆ తరువాత సదావర్తి భూముల వ్యవహారంలో కోర్టుకెళ్లడం అక్కడ అనుకూలంగా  తీర్పొచ్చింది. అత్యంత విలువైన సదావర్తి భూములను కేవలం 22 కోట్లకే టీడీపీ నేతలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఆయన అడ్డుకున్నారు...  ఎక్కువ ఇచ్చి భూమిని తీసుకోవాలని హైకోర్టు సూచించడంతో ఆయన అందుకు రెడీ అనడమే కాకుండా గురువారం ఆయన రూ.10 కోట్లు చెల్లించారు.
    
సదావర్తి భూముల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలకు సై అన్న ఆళ్లను అప్పుడే మంత్రి లోకేశ్ పరోక్ష బెదిరింపులు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల ఆ డబ్బు చెల్లిస్తే ఐటీ దాడులు చేయిస్తామన్నారు. అయినా ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక్కు తగ్గలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఏకంగా 10కోట్లు చెల్లించేశారు. దేవాదాయ శాఖ అకౌంట్‌ కు ఆ డబ్బు జమ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మొమో రూపంలో కోర్టుకు సమర్పిస్తామన్నారు.
    
కాగా ఈనెల 17న సదావర్తి భూములపై హైకోర్టు విచారణ జరగనుంది. అక్కడికి రెండు వారాల్లో మిగిలిన 17 కోట్ల 44 లక్షలు చెల్లిస్తానని ఎమ్మెల్యే చెప్పారు.  దీంతో టీడీపీ ప్రభుత్వానికి ఏమనాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు... ఐటీ దాడులు చేయిస్తానన్న లోకేశ్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News