ఏపీ సీఎం చంద్రబాబు పుత్రరత్నం, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు ప్రతిభాపాటవాల గురించి రాస్తూ పోతే మరో రామాయణం అవుతుందని సోషల్ మీడియాలో గతంలో సెటైర్లు పేలిన సంగతి తెలిసిందే. చినబాబు ఖ్యాతి గురించి ఇప్పటికే పుటలుపుటలుగా చెప్పుకుంటున్నప్పటికీ ఆయన తీరుతెన్నుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. జయంతిని వర్ధంతి చేయడం మొదలుకొని...తన ప్రసంగాల్లో తేట`తెలుగు`కోసం స్పెషల్ క్లాసులు పెట్టించుకోవడం వరకు చినబాబు రూటే సెపరేటు. తాను మాట్లాడేటపుడు చెప్పిందే వినాలని....వాదనలు చేయకూడదని అగ్రిగోల్డ్ బాధితులపై `దురద` కామెంట్స్ చేసిన లోకేష్....తాజాగా మరోసారి `చెత్త` కామెంట్ చేసి నెటిజన్ లకు దొరికిపోయారు. ‘సంపద నుంచి చెత్తను సృష్టించడం’ అనే బృహత్తర కాన్సెప్ట్ కు చినబాబు శ్రీకారం చుట్టారు. బుధవారం నాడు విజయవాడలో జరిగిన `స్వచ్ఛతే సేవ` కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తన ఫేస్ బుక్ ఖాతాలో చినబాబు చేసిన ఈ `చెత్త` పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మిస్తామని - తద్వారా వేస్ట్ మేనేజ్ మెంట్ కు శ్రీకారం చుడతామని చినబాబు సెలవిచ్చారు. ఆ క్రమంలోనే `చెత్త నుంచి సంపద` సృష్టిస్తామని చెప్పబోయి....`సంపద నుంచి చెత్త` సృష్టిస్తామని చెప్పి యథావిధిగా `పప్పు`లో కాలేశారు. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. చాలా కాలం నుంచి చిన బాబు కామెడీని మిస్ అవుతున్న నెటిజన్లు...తమ ఎటకారానికి చమత్కారం జోడించి ట్రోలింగ్ మొదలెట్టారు. అయితే, చినబాబు `చెత్త` కాన్సెప్ట్ లో దాగున్న మర్మాన్ని నెటిజన్లు మిస్ అయ్యారు. వాస్తవానికి, సంపద నుంచి చెత్తను సృష్టించడమనే చినబాబు విజన్ ను వారు పసిగట్టలేకపోయారు. పచ్చటి పంటలు పండే పొలాలను బీడులుగా మార్చడం, భూములు అప్పజెప్పని వారి పంటలకు నిప్పుపెట్టడం...ఇదంతా ఆ కాన్సెప్ట్ లో భాగమే.
అమరావతి బాండ్ల పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం....ఇవి చాలక అందిన వరకు దోపిడీ చేసి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టడం కూడా ఆ కాన్సెప్ట్ లో భాగమే. ఇసుక దోపిడీ - బాబు - చినబాబుల విదేశీ పర్యటనలు - అవసరం లేకపోయినా ప్రత్యేక విమానాలలో స్వైర విహారం, బాబుగారి స్నానం ఖర్చులు - బాబుగారి ఉపవాసం ఖర్చులు - ధర్మ దీక్షలు - పోరాట యాత్రలు - అమాత్యుల పన్నుపోటు ఖర్చులు.. ఇవన్నీ కూడా సంపద నుంచి చెత్త సృష్టించే మార్గాలేనని ప్రజలు - నెటిజన్లు గుర్తించలేకపోవడం దురదృష్టకరం. కాబట్టి, చినబాబు ఆచితూచి..ఆలోచించి చేసిన ఆ `చెత్త`కామెంట్ లో దాగున్న నిగూడార్థాన్ని తెలుసుకోకపోవడం...నెటిజన్ల అజ్ఞానం మాత్రమేనని చెప్పక తప్పదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా....దేశం మొత్తం వెదికినా...లోకేష్ అంతటి లోక జ్ఞానం...ఉన్న రాజకీయ నేత మరొకరుండరంటే అతిశయోక్తి కాదేమో!