తెలంగాణలో వరుస ఎన్నికల జోరు కొనసాగుతోంది. మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్ తాజాగా విడుదలైంది. కాంగ్రెస్ తరఫున గెలిచిన కిష్టారెడ్డి కొద్దికాలం క్రితం హఠన్మరణం చెందడంతో ఈ ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 20న నోటిఫికేషన్ వెలువడనుంది. 20 నుంచి 27 వరకు నామినేషన్ల స్వీకరణ, 30 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఫిబ్రవరి 13న పోలింగ్.. 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి నేపథ్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గం ఎన్నికను ఏకగ్రీవంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. అయినప్పటికీ టీఆర్ ఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మరోవైపు ఆ పార్టీ అంతర్గతం ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ బాధ్యతలను మంత్రి హరీశ్ రావు భుజాన వేసుకునే అవకాశం ఉంది.