ప్రధాని నరేంద్రమోడీ సొంత పార్టీ సీఎంకు వార్నింగ్ ఇచ్చారు. సాక్షాత్తు తన ప్రాతినిధ్యం వహించిన రాష్ర్టాన్ని ఏలుతున్న సీఎంకు హెచ్చరికలు జారీ చేయడం ఇపుడు కలకలం సృష్టిస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ తన పటేల్ పరువు ప్రతిష్టలను కాపాడుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆనందిబెన్ కుమారులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రధాని ఆమెను హెచ్చరించారు.
సీఎం ఆనందిబెన్ కుమారులు అనార్, శ్వేతాంక్‌ల వ్యవహార శైలిని నియంత్రించుకోవాలని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతే కాకుండా ఆనందిబెన్ తన ఇమేజ్ ను సరిదిద్దుకోవాలని కూడా ప్రధాని ఆమెకు సూచించారు. గుజరాత్ లోనే కాకుండా ఢిల్లీలో కూడా ఆనందిబెన్ కుమారుల వ్యవహార శైలి గురించిన ప్రచారం విపరీతంగా జరుగుతున్నట్లు మోడీ ఆమెకు చెప్పారు. ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే సరిపెట్టకుండా చివరలో ఉపశమనం కలిగించే మాటలు కూడా చెప్పారు. పార్టీలోని వ్యతిరేకులు ఈ ప్రచారానికి ఒడిగడుతున్నట్లుగా ఉందని ఆనందిబెన్ తో మోడీ అన్నారు