ఫేస్ బుక్ చక్రవర్తిగా మోడీ

Update: 2017-02-22 07:17 GMT
ఫేస్ బుక్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న నేతగా ప్రపంచంలోనే తొలి స్థానం సంపాదించారు మన ప్రధాని మోడీ. ఆయన వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతాను ఏకంగా 4 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రపంచంలో ఇంకే నేతకూ ఇంత భారీ ఫాలోయింగ్ లేదు. దీంతో మోడీ చరిత్ర సృష్టించినట్లయింది. కాగా ప్రఖ్యాత బర్సన్-మార్సటెల్లర్ సంస్థ రిలీజ్ చేసిన ఈ గణాంకాల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మోడీ తరువాత రెండో స్థానంలో ఉన్నారు. అయితే. మోడీకి, ఆయనకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ట్రంప్ ఫాలోవర్ల సంఖ్య కేవలం రెండు కోట్లు మాత్రమే.
    
కాగా మోడీ ఫస్టు ప్లేసులో ఉన్న ఈ జాబితాలో మూడో స్థానం ఎవరికి దక్కిందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. మూడో ప్లేసులో మన ప్రధాని కార్యాలయం ఉంది. పీఎంవో ఫేస్ బుక్ ఖాతాకు 1.3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ జాబితాలో మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 9వ స్థానంలో విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ 16వ స్థానంలో ఉన్నారు.
    
కేవలం ఫాలోవర్ల సంఖ్య పరంగానే కాకుండా మోడీ పోస్టులు లైకులు, షేర్ల విషయంలోనూ టాప్ లో ఉన్నాయి. మోడీ తన తల్లి ఇంటికి వెళ్లినప్పటి చిత్రాలకు ఏకంగా 17 కోట్ల మందికిపైగా లైకులు, షేర్లు చేశారట. ఇలా ఇంటరాక్షన్ల విషయానికొస్తే కంబోడియా ప్రధాని హున్ షేన్ పోస్టింగు మోడీ పోస్టింగు తరువాత స్థానం దక్కింది. అయితే, దానికి వచ్చిన రెస్పాన్సు కేవలం 5.8 కోట్లు మాత్రమే.
    
కాగా 2016 సంవత్సరం మొత్తం ప్రపంచంలోని 590 నేతలకు చెందిన అధికారిక ఫేస్ బుక్ పేజీలను ఈ సంస్థ విశ్లేషించింది. ప్రధానులు - అధ్యక్షులు - విదేశాంగ మంత్రులను ఇందుకు ఎంచుకుంది. ఈ డాటా కోసం ఫేస్ బుక్ కు చెందిన క్రౌడ్ టాంగిల్ టూల్ ను ఉపయోగించుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News