'ఎంపీ' ల పొగడ్త.. ప్రధాని భావోద్వేగం

Update: 2016-11-22 09:47 GMT
ఎవడి గోల వాడిదన్నట్లుగా ఉంది తాజా యవ్వారం చూస్తే. పెద్ద నోట్ల రద్దునిర్ణయం కారణంగా దేశ ప్రజలు బ్యాంకుల వద్దా..ఏటీఎం దగ్గర కిందామీదాపడుతున్న పరిస్థితి. మరోవైపు ప్రజల్ని ఇంతగా కష్టపడెతారా? అంటూ విపక్షాలుదుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్రం తీసుకున్న రద్దు నిర్ణయంతో తమకేమాత్రంసంబంధం లేనట్లుగా రాష్ట్రాలు వ్యవహరిస్తూ.. ప్రజల కష్టాలపై ఆయా రాష్ట్ర సర్కార్లు చూసీచూడనట్లుగా ఉండటంతో సామాన్యుడి కష్టాలు మరింతగాపెరుగుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరోవైపు బీజేపీ మాత్రం రద్దు నిర్ణయం తీసుకున్నతమ నాయకుడ్ని విపరీతంగా పొగిడేస్తుంది. నిజానికి అదేం తప్పు కాదు. కానీ..ఓపక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నవేళ.. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న వేళ.. బీజేపీ పార్లమెంటరీ సమావేశాన్న నిర్వహించి మరీ..ప్రధానికి అభినందనలతో ముంచెత్తటం కమలనాథులకే చెల్లుతుంది.

రద్దుపై గళం విప్పిన విపక్షాల మాటల్ని తాము ఏ మాత్రం పట్టించుకోవటంలేదని.. అసలు  అలాంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలేదన్నట్లుగా బీజేపీ వ్యవహారశైలి ఉందని చెప్పాలి. ఓపక్క సభకు ప్రధాని హాజరు కావాలని.. తాము చెబుతున్న మాటల్ని వినాలంటూ విపక్ష నేతలు నెత్తినోరు కొట్టుకుంటున్న వేళ.. సభకు గైర్హాజరైన ప్రధాని మోడీ.. అందుకుభిన్నంగా బీజేపీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రద్దుపై తమ పూర్తి మద్దతును ప్రకటిస్తూ.. ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

పార్టీ నేతలు చూపించిన విధేయతకు కరిగిపోయారో.. లేక నిజంగానే భావోద్వేగానికి గురయ్యారో తెలీదు కానీ మోడీ .. పార్టీ ఎంపీలంతా కదిలిపోయేలా మాట్లాడారు. అవినీతి.. నల్లధనం మీద చేయాల్సిన పోరాటంలో ఇది ప్రారంభం మాత్రమేనని.. రానున్నరోజుల్లో దీనిపై మరింత ముమ్మరంగా పోరాటాన్ని చేస్తామన్నారు. పెద్దనోట్ల రద్దుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా మోడీ మండిపడ్డారు.

పన్ను ఎగవేతకు చెక్ చెప్పేలా నోట్ల రద్దు నిర్ణయం సాయం చేస్తుందన్న ఆయన..పెద్దనోట్ల రద్దు కారణంగా కలిగే ప్రయోజనాల్ని ప్రజలకు వివరించాల్సిందిగాకోరారు. బయట జరుగుతున్న దాంతో తమకు సంబంధం లేనట్లుగా తమధోరణిలో తాము వెళ్లటం మోడీ పరివారానికి మాత్రమే చెల్లుతుందేమో..?

ఇదిలా ఉంటే రద్దు నిర్ణయంపై తమ అభిప్రాయాల్ని నేరుగా తనకే చెప్పాలంటూప్రధాని మోడీ దేశ ప్రజల్ని కోరారు. రద్దుపై దేశ ప్రజల అభిప్రాయాల్ని తానుతెలుసుకోవాలని అనుకుంటున్నానని.. అందుకే.. ఎన్‌ఎం యాప్‌ (http://nm4.in/dnldapp) లో నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొనాలని ఆయన కోరుతున్నారు. మరి.. మోడీ మాటకు దేశ ప్రజలు ఎలా స్పందిస్తారో? ఎంతలా రియాక్ట్ అవుతారో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News