వాజ్ పేయి - మోడీ రేర్ వీడియో..

Update: 2018-08-17 05:13 GMT
నరేంద్రమోడీ.. ఇప్పుడంటే దేశ ప్రధాని.. కానీ ఒకప్పుడు తండ్రితో కలిసి టీ అమ్మేవాడు. సామాన్య కార్యకర్తగా ఆర్ ఎస్ ఎస్ లో చేరిన మోడీ అనంతరం బీజేపీ కార్యకర్తగా మారారు. అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. అప్పటి ప్రధాని వాజ్ పేయి - ఎల్.కే అద్వాణీల ఆశీర్వచనం కోసం వెంపర్లాడేవాడు.. వాజ్ పేయికి నరేంద్రమోడీకి చక్కటి అనుబంధం ఉంది. మోడీని వాజ్ పేయి ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చాడని అంటారు.

ప్రస్తుతం మాజీ ప్రధాని వాజ్ పేయి మన లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఓ దిగ్గజ ధృవతార రాలిపోయింది. దేశం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా తన సర్వస్వం   ధారపోసిన మహనీయుడిని తలుచుకొని దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రధాని మోడీ... వాజ్ పేయి అంతిమగడియల్లో ఢిల్లీలోని ఆయన చికిత్స పొందిన ఎయిమ్స్ కు రెండు మూడు సార్లు వెళ్లొచ్చారు. ఆయన మరణం తర్వాత తీవ్ర మనస్థాపం చెందారు..

ఈ సందర్భంగా మోడీ ట్విట్టర్ లో వాజ్ పేయి గురించి బాధతో రాసుకొచ్చారు. . ‘నాకు మాటలు రావడం లేదు. అటల్ జీ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన ప్రతి నిమిషం దేశం కోసం పనిచేశారు. ప్రియమైన నేత వాజ్ పేయి దివంగతులు కావడంతో భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయింది’ అంటూ మోడీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.

నరేంద్రమోడీ బీజేపీ కార్యకర్తగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని వాజ్ పేయిని బీజేపీ పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు. అటల్ దగ్గరకు రావడానికి ఫుల్ సెక్యూరిటీ, నాయకులు అడ్డు గోడుగా ఉన్న సమయంలో అతికష్టం మీద అటల్ జీ వద్దకు మోడీ వచ్చాడు. ఆయనను అక్కున చేర్చుకున్న వాజ్ పేయి భుజం తట్టి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News