బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు ప్రధాని నరేంద్ర మోడీ సారీ చెప్పారు. సోమవారం సాయంత్రంఎల్ బీ స్టేడియంలో విజయ్ సంకల్ప్ పేరుతో నిర్వహించిన సభ భారీగా సక్సెస్ కావటం తెలిసిందే. అనుకున్నట్లే ఎల్ బీ స్టేడియంకు భారీఎత్తున జనాన్ని సమీకరించటంలోనూ.. స్టేడియం మొత్తం కళకళలాడేలా చేయటంలో కమలనాథులు సక్సస్ అయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సరదాగా మొదలైన సంభాషణలో మోడీ నోటి నుంచి వచ్చిన ఒక మాట.. చివరకు ఆయన సారీ చెప్పే వరకూ వెళ్లింది.
బీజేపీ సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నంతనే హోళీ వేళ రంగులతో ఆయన ఆడే తీరు.. పండగ జరిగిన రెండు నెలల వరకూ ఆయన జుట్టు మొత్తం రంగుతో ఉండటం ఒక ట్రేడ్ మార్క్ లా అందరికి గుర్తుండిపోతుంది. దత్తన్న రంగు జుట్టు మోడీ మనసులో కూడా రిజిస్టర్ అయిపోయింది.
ప్రతిసారీ హోలీ తర్వాత రెండు మూడు నెలల పాటు దత్తన్న జట్టు రంగుతో ఉండటం.. ఈసారి అలా లేకపోవటాన్ని చూసిన మోడీ.. ఈసారి మీ జుట్టుకు రంగు లేదేమిటి? హోలీ రంగు ఏది? అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన దత్తాత్రేయ.. తన కుమారుడు మరణించటంతో ఈసారి తాను హోలీ ఆడలేదన్న విషయాన్ని చెప్పారు. దత్తన్న పుత్రశోకాన్ని తాను మర్చిపోయిన దానికి మోడీ సారీ చెప్పారు. నాకు ఆ విషయం జ్ఞాపకం లేదు క్షమించాలని కోరినట్లుగా తెలిసింది.