మహిళాభివృద్ధి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని హెచ్ ఐసీసీ వేదికగా జరుగుతున్న జీఈఎస్ -2017లో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా తన లక్ష్యాన్ని కూడా ప్రధాని వెల్లడించారు. అనేక అడ్డంకులు సృష్టించే పాత చట్టాలను చెత్త బుట్టలో వేశామన్నారు. మూడేళ్లలో కొత్త సంస్కరణలతో సరళతర వాణిజ్యంలో 140 నుంచి 100కు చేరుకున్నామని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ ర్యాంకు మెరుగుపడినప్పటికీ...100 ర్యాంకుతో తాము సంతృప్తి చెందడం లేదని 50వ ర్యాంకు లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.
భారత చరిత్రలో మహిళల విశిష్ట ప్రాధాన్యతను ప్రధానమంత్రి గుర్తు చేశారు. భారత స్వాతంత్య్రోద్యమంలో ఎంతో మంది మహిళలు కీలకపాత్ర వహించారని ప్రధాని గుర్తు చేశారు. మహిళను శక్తిగా భారతీయులు విశ్వసిస్తారని వెల్లడించారు. అహల్యబాయి హోళ్కర్ - ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్లు భారత మహిళా శక్తికి ప్రతీకలు అని ప్రశంసించారు. కల్పనా చావ్లా - సునీతా విలియమ్స్ భారత మహిళా మేధోశక్తికి నిదర్శనమని తెలిపారు. వ్యవసాయ రంగంలో 50 శాతం భాగస్వామ్యం మహిళలదే అని గుర్తు చేశారు. గుజరాత్ పాల ఉత్పత్తి సంఘాల్లో లిజ్జత్ పాపడ్ మహిళా శక్తికి నిదర్శనమని చెప్పారు. ఆయుర్వేదం - యోగా భారత్ ప్రపంచానికి అందించిన ఆవిష్కరణలు అని తెలిపారు. హైదరాబాద్ నగరం సైనా నెహ్వాల్ - పీవీ సింధు - సానియా మీర్జాలకు నిలయమని ప్రధాని పేర్కొన్నారు.
మానవాళి జీవన ప్రమాణాల మెరుగుదలకు కొత్త ఆవిష్కరణలు చేసే శక్తి భారతీయులకు ఉందని ప్రధానమంత్రి అన్నారు. దశాంశ మానము - సున్నా ఆవిష్కరణలు భారత మేధో శక్తికి నిదర్శనమని ప్రధానమంత్రి గుర్తు చేశారు. పురాతన కాలం నుంచి మన వాణిజ్య పురోగతికి లోథాల్ నౌకాశ్రయం నిదర్శనమని చెప్పారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడమే స్టార్టప్ ఇండియా లక్ష్యమని ఉద్ఘాటించారు.ఆవిష్కరణలు - వ్యాపారవేత్తలకు ఇండియా ఇంక్యూబేటర్ గా పని చేస్తుందని చెప్పారు. స్టార్టప్ ఇండియా ఔత్సాహికులకు సహకారం అందించే సమగ్ర వ్యవస్థ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. జన్ ధన్ యోజనతో ఇప్పటి దాకా దూరంగా ఉన్నవారిని ప్రధాన స్రవంతిలో భాగం చేశామని మోడీ పేర్కొన్నారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాలు పొందిన వారిలో 50 శాతం మహిళలే ఉన్నారన్నారు.
భారత్ - అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించడమే జీఈఎస్ లక్ష్యమని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలో మహిళల పాత్ర కీలకమైందని అన్నారు. జీఈఎస్ లో 50 శాతానికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలే ఉన్నారని తెలిపారు. కాగా, అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ - ఇవాంకా ట్రంప్ లు ఇద్దరూ ఇవాళ బటన్ నొక్కి సదస్సును ప్రారంభించారు. అంతకముందు మోడీ - ఇవాంకా - కేసీఆర్ లు.. ఆడియో విజువల్ షోను తిలకించారు. ఆరంభోత్సవం సందర్భంగా నిర్వహించిన డ్యాన్ షోను కూడా వీక్షించారు. జీఈఎస్ లోగోను ఆవిష్కరించాలని మిత్ర రోబో ఆహ్వానం పలికింది. ప్రధాని మోడీ - ఇవాంకాలకు రోబో స్వాగతం పలికడం విశేషం. మిత్ర రోబోను బెంగళూరుకు చెందిన స్టార్టప్ డెవలప్ చేసింది. రోబో మీద ఉన్న ఇండియా లోగోను మోడీ నొక్కగా, అమెరికా లోగోను ఇవాంకా నొక్కారు. దీంతో అధికారికంగా సదస్సు ఆరంభమైంది.