ఈనెల 30.. అటు ఏపీకి,.. ఇటు దేశానికి కొత్త ప్రభుత్వాలు వచ్చే అపురూపమైన రోజు. ఈ రోజు కోసం ఇటు వైసీపీ, అటు కేంద్రంలోని బీజేపీ కూడా ఎదురుచూస్తోంది.నిన్న గెలవగానే తాను ఈ నెల 30న మంచి ముహూర్తాన విజయవాడలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు..
ఇక తాజాగా కేంద్రంలో వరుసగా రెండోసారి స్పష్టమైన మెజార్టీని సాధించిన నరేంద్రమోడీ కూడా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తాన్ని ఈనెల 30నే ఖరారు చేయడం విశేషం. తాజాగా 16వ లోక్ సభ రద్దుకు శుక్రవారం కేంద్ర కేబినెట్ సమావేశాన్ని మోడీ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు పార్లమెంట్ సౌత్ బ్లాక్ లో చివరి కేబినెట్ భేటి జరగనుంది.
అయితే ఆశ్చర్యకరంగా మోడీ ప్రభుత్వం రెండోసారి గెలిచాక.. ఓట్ల ఫలితాల వెలువడ్డాక కేంద్ర కేబినెట్ భేటి నిర్వహిస్తుండడం విశేషం. నేటి కేబినెట్ భేటిలో లోక్ సభ రద్దుకు సంబంధించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలుపునుంది.
అనంతరం 26న బీజేపీ తరుఫున దేశవ్యాప్తంగా గెలిచిన ఎంపీలందరితో కలిసి పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నారు. అదే రోజున బీజేపీ లోక్ సభ పక్ష నేతను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు లోక్ సభ రద్దు.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందడుగు పడనుంది.
కాగా నేటి కేబినెట్ భేటికంటే ముందు బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భేటి కానున్నారు. ఇక మోడీ రెండోసారి తనను గెలిపించిన వారణాసి ప్రజలకు కృతజ్ఞత చెప్పేందుకు 28న వారణాసి పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. 29న గాంధీనగర్ వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదాన్ని మోడీ తీసుకోనున్నారు.