నాలుగేళ్లుగా ఎదురుకాని అవిశ్వాస తీర్మాన అనుభవం తాజాగా ఎదురు కావటమే కాదు.. కాసేపట్లో మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న వేళ.. దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. తుది ఫలితం మీద ఎవరికి ఎలాంటి ఉత్కంట లేకున్నా.. చర్చ సందర్భంగా ఏ పార్టీ ఎలా మాట్లాడుతుందన్నది ఒక ఆసక్తి అయితే..ఏపీ ప్రత్యేక హోదా మీదా.. విభజన హామీల మీద ఏమేరకు చర్చ జరుగుతుంది?.. అవిశ్వాసం ఏపీకి ఎంతమేరకు లాభం చేకూరేలా చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉంటే.. అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర చర్చ జరగటానికి కొద్ది గంటల ముందు.. ఇదే అంశంపై మోడీ ఒక ట్వీట్ చేయటం విశేషం. ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఏమంటే.. ఇది చాలా ముఖ్యమైన రోజు. అంతరాయం లేని.. నిర్మాణాత్మక చర్చకు సహచర ఎంపీలంతా సహకరిస్తారనేఆశిస్తున్నా. చర్చనుఎంపీలంతా సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నా. ప్రజలకు.. రాజ్యాంగ రూపకర్తలకు మనం ఈ ప్రమాణం చేస్తున్నామని.. దేశమంతా ఈ చర్చను పరిశీలిస్తుందని భావిస్తున్నా. అంటూ ట్వీట్ చేశారు.