ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురించి ఆయన కార్యాలయం ఒక విషయాన్ని బయటపెట్టింది. ఈ విషయం విని ఎవరు ఎలా స్పందించినా కానీ, మోడీ గురించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంచలనమే చెప్పాలి. 2014, మే 26న ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు మోడీ ఒక్కటంటే ఒక్క రోజుకూడా సెలవు తీసుకోలేదట. సాధారణంగా కార్మిక చట్టాల ప్రకారం ఒక ఉద్యోగి 8 గంటలు, మరి కొన్ని సందర్భాల్లో 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. కానీ దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మాత్రం పూర్తిగా తన రోజు మొత్తాన్ని దేశం కోసమే వినియోగిస్తున్నారట.
వారంలో ఏడు రోజులూ, రోజుకున్న 24 గంటలూ ప్రధాని పనిచేస్తూనే ఉన్నారని, ప్రమాణ స్వీకారం చేసిననాటి నుంచి ఆయన ఒక్క సెలవు కూడా తీసుకోలేదని పీఎంవో తెలిపింది. దేశ ప్రధానుల సెలవులకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించిన ఒక వ్యక్తికి పీఎంవో మంగళవారం ఈ మేరకు రాతపూర్వక సమాధానం చెప్పింది. అయితే గత ప్రధానుల సమాచారం తమ వద్ద లేదన్న ప్రధానమంత్రి కార్యాలయం, ప్రస్తుత ప్రధాని మాత్రం ఒక్క రోజుకూడా సెలవు తీసుకోలేదంటూ రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
అయితే ఈ విషయాలపై... ఏ మనిషైనా 8, 12 లేదా 16 అదీ కాదంటే 20 గంటలు పనిచేస్తున్నారని అంటే కాస్త నమ్మశక్యంగానూ, పద్దతిగానూ ఉంటుంది కానీ, మరీ ఇదేమిచిత్రం అని కొందరంటుంటే... 100కోట్లకు పైగా ఉన్న దేశ ప్రధాని రోజులో ఏ క్షణమైనా ఏ విషయంపై అయినా స్పందించాల్సి వస్తుంది కాబట్టి పీఎంఓ అలా స్పందించి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా 66 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా దేశాన్ని నడిపిస్తోన్న మోడీ... 24X7 ఆన్ డ్యూటీ విషయంలో నిజంగా సూపర్!!