కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ జోరు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో పలు దేశాలు తమ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విస్తరించి, పిల్లలు, తక్కువ ముప్పు ఉన్న వర్గాలకూ వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. అలాగే పలు సంస్థలు కరోనా వ్యాక్సిన్లు తయారుచేసే పనిలో నిమగ్నమైయ్యారు. కరోనాకు మరో సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. అయితే ముక్కులో వేసే నాసల్ స్ప్రేల రాకతో, ఈ మహమ్మారిపై పోరు కొత్త మలుపు తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనడాలోని శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే ను తయారుచేసింది.
కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం తగ్గిస్తుందని, ఎగువ శ్వాసనాళాల్లోని వైరస్ ను ఈ నాజల్ స్ప్రే చంపేస్తుందని పేర్కొంది. శ్వాస నాళాలలో పాగా వేసే వైరస్ ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందని, తాము అభివృద్ది చేసిన ఈ నాసల్ స్ప్రే అక్కడున్న వైరస్ ను సమూలంగా నిర్మూలిస్తుందని సంస్థ వెల్లడించింది. వైరస్ బారినపడిన 79 మందిపై ఈ స్ప్రేను పరీక్షించగా 24 గంటల్లోనే 95 శాతం వైరల్ లోడు తగ్గినట్టు గుర్తించారు.72 గంటల్లో 99 శాతం మేర వైరల్ లోడును తగ్గించింది. బ్రిటన్ వేరియంట్‌పైనా ఇది సమర్థంగా పనిచేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఔషధం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని , ఈ ఔషధాన్ని భారత్ లో ఉత్పత్తి చేసేందుకు శానోటైజ్ సంస్థ ప్రయత్నిస్తోంది. కాగా, ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ప్రభుత్వాలు ఇప్పటికే దీని వినియోగానికి అనుమతి ఇచ్చాయి.