ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన నటరాజన్ .. ఎంతో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నటరాజన్‌కు సోషల్‌మీడియాలో ఎందరో అభిమానులు ఉన్నారు. అయితే అతడు అనూహ్యంగా భారతజట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లాడు. తొలుత చాలామంది నటరాజన్ ఎంపిక పట్ల విమర్శలు గుప్పించారు. అతడు ఏ మేరకు రాణిస్తాడోనని అన్నారు. కానీ నటరాజన్ మాత్రం టీ20 సీరిస్‌లో తన బౌలింగ్‌తోనే విమర్శకుల నోర్లు మూయించాడు. సాధారణంగా ఏ బౌలర్ అయిన ప్రారంభంలో భయపడతాడు. తనను తాను నిరూపించుకోవలన్న తపనతో తప్పులు చేస్తుంటారు. దారాళంగా పరుగులు ఇస్తుంటారు.
తొలి సారి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆడే ఏ బౌలర్‌కు కైనా అటువంటి ఇబ్బంది ఉంటుంది. కొందరు బౌలర్లు మాత్రమే స్టాటింగ్ ట్రబుల్స్‌ను ఎదుర్కొంటూ ఉంటారు. నటరాజన్ కూడా ఆ కొందరి దారిలోనే వెళ్తున్నాడు. ఏ మాత్రమ బెరుకు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. కీలక వికెట్లు తీస్తూ.. లో యార్కర్బాల్స్ వేస్తూ అదరగొడుతున్నాడు. గత రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ నటరాజన్ మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా బంతులను విసురుతున్నాడు.
జహీర్, ఇషాంత్, బుమ్రా బౌలర్లు తొలి నుంచి రాణించారు. ప్రస్తుతం నటరాజన్ కూడా ఆ జాబితాలోకి వెళ్లినట్టే కనిపిస్తుంది. ఈ ఆస్ట్రేలియా టూర్ భారత బౌలర్లు బుమ్రా, షమీ పెద్దగా రాణించడం లేదు. కానీ నటరాజన్ మాత్రం విభిన్నంగా బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. సిడ్నీలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ బౌలింగ్ సీనియర్ క్రికెటర్లను సైతం ఆబ్బుర పరిచింది. నిజానికి ఈ స్టేడియం బౌలింగ్‌కు అనుకూలంగా లేదు. చేయి తిరిగిన ఆస్ట్రేలియా బౌలర్లు సైతం పరుగులు సమర్పించుకున్నారు.కానీ నటరాజన్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో ‘భారతజట్టుకు మరో ఫాస్ట్ బౌలర్ దొరికినట్టే’ అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.