ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. తన ఆక్రోషాన్ని చాటుకునేందుకు బాబు ప్రయత్నం చేస్తే...ఆయన పై ప్రకృతి ప్రకోపం దాల్చిందనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగిదంటే...ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు అన్యాయం చేసిందంటూ దీనికి నిరసనగా తిరుపతిలో టీడీపీ `ధర్మపోరాట సభ` నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఏపీకి మోడీ ఇచ్చిన హామీలను వివరిస్తూ కేంద్ర సర్కారుని ఎండగట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ దీక్షకు ప్రకృతి పరంగా సవాళ్లు ఎదురయ్యాయి.
తిరుపతిలోని తారకరామ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చేలా టీడీపీ సన్నాహాలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకుకొని ఆ తరువాత సభలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సమయంలోనే తారకరామా స్టేడియంలో జరిగే టీడీపీ ధర్మపోరాట దీక్షకు వర్షం అడ్డంకిగా మారింది. తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలికి స్టేడియంలో రెండు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు పగిలిపోయాయి. హోర్డింగ్‌లు కూలిపోయాయి. గాలికి కుర్చీలు ఎగిరిపోయాయి. దీంతో హాజరైన వారిలో ఆందోళన కనిపించింది.
కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహం, చేస్తోన్న కుట్ర రాజకీయాలను తాము ఎండగడతామని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటే వారికి ప్రకృతి ప్రకోపంతో ఊహించని షాక్ తగిలిందనే చర్చ వినిపిస్తోంది. తిరుమల వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్ల పాటు మౌనం వహించి అనంతరం తమ రాజకీయం కోసం ఆందోళన చేసేందుకు బాబు సిద్ధమవుతున్న తీరును ప్రకృతి సైతం అంగీకరించలేదని...అందుకే..40 డిగ్రీలకు పైగా రాష్ట్రమంతా ఎండలు ఉండటే...తిరుపతిలో మాత్రం జోరుగా వర్షం కురిసిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దీక్షకు రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు భారీ ఏర్పాట్లు చేయగా..వారికి నిరాశే మిగిలిందని పేర్కొంటున్నారు. ఈ వేదికగా తాజా మాజీ మిత్రపక్షమైన బీజేపీని తమ ప్రత్యర్థి అయిన వైసీపీని ఎండగట్టాలని చూస్తే..వారికి ఊహించని ఎదురుదెబ్బ తగలిందని..బాబు తీరును ప్రకృతి కూడా అంగీకరించలేదా అనే సందేహాన్ని పలువురు చర్చించుకోవడం గమనార్హం.