ఉగ్రవాద కార్యకలాపాలతో దేశంలో కలకలం సృష్టించాలని పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాది నవేద్ పట్టుబడటం తెలిసిందే. జమ్మూకాశ్మీర్ లోని స్థానికుల సాహసంతో ఉగ్రవాది నవేద్ ప్రాణాలతో పట్టుబడటం తెలిసిందే. ఇతన్ని అదుపులోకి తీసుకున్న విచారణ అధికారులు.. అతనిచ్చిన సమాచారంతో.. అతనికి సాయం చేసిన వారితో పాటు.. ఉగ్రవాదులకు సానుభూతిపరులైన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక.. నవేద్ కు పన్నెండు మంది ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నవేద్ ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారించాలని నిర్ణయించారు. దీంతో.. అతన్ని ఢిల్లీకి తరలించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు నవేద్ ను రహస్యంగా ఒక ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించినట్లుగా తెలుస్తోంది. ముంబయి దాడి ఘటనలో పట్టుబడిన కసబ్ కు సైతం విచారణ కోసం.. అతన్ని ఉరి తీసే నాటికి కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చూస్తుంటే.. తాజాగా పట్టుబడిన నవేద్ కు శిక్ష విధించి.. దాన్ని అమలు చేసే నాటికి మరెన్ని కోట్లు ఖర్చు అవుతాయో..?