భ‌ర్త పార్టీని కాద‌ని ఆ పార్టీ వైపు చూపు

Update: 2016-11-25 07:42 GMT
ఢిల్లీ పీఠానికి ద‌గ్గ‌రి దారి అంటూ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ కు ఇప్ప‌టి వ‌ర‌కు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇపుడు అదే కోవ‌లో ప్ర‌చారంలోనూ యూపీ సో స్పెష‌ల్ అనిపించుకుంటోంది. ఇటీవల భారత సైన్యం పీవోకేలోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలపై జరిపిన లక్షిత దాడుల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ లో అందుకు సంబంధించి వెలసిన పోస్టర్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లక్షిత దాడులను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ప్రస్తుతం అదే రాష్ట్రంలో పెద్ద నోట్ల రద్దు అంశంపై పోస్టర్లు వెలిశాయి.

తాజాగా యూపీలో వెలిసిన పోస్ట‌ర్ల ప్రకారం ప్రధాని మోడీ ఫోటోతో పాటు బీజేపీ పార్టీ చిహ్నాలు ఉన్నాయి. నల్లధనంపై మోడీ యుద్ధం చేశారని బారాబంకి జిల్లాలో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల నుంచి సానుకూలంగానే స్పందన వస్తుందని బీజేపీ అగ్ర నేతలు ఇప్పటికే ఎన్నో సభల్లో చెప్పారు.తాజాగా వెల‌సిన ఈ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్త అవిదేశ్‌ శ్రీవాస్తవ  మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయం బాగుందని, అయితే, అందులో కాస్త మార్పు చేసి ఉండాల్సిందని మీడియాతో వ్యాఖ్యానించారు. బీజేపీ తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కాదని చెప్పారు. ఇదే అంశంపై పోస్టర్లు వెలిసిన బరబంకి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువ రైతు సునీల్‌ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రబీ సీజన్‌ పై అధికంగా పడిందని తన అభిప్రాయాన్ని తెలిపారు. తమకు విత్తనాలు కొనుగోలు చేసేందుకు రద్దయిన నోట్లను తీసుకునేందుకు అనుమతించాలని అన్నారు.

ఇదిలాఉండ‌గా...బీజేపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ తన భర్త వ్యవస్థాపకుడిగా ఉన్న ఆవాజ్‌- ఏ- పంజాబ్‌ను కాదని కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఈ నెల 28న కాంగ్రెస్‌ లో చేరనున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్‌ లో బీజేపీని వీడిన నవజ్యోత్‌ కౌర్‌ తో పాటు ఆవాజ్‌- ఏ- పంజాబ్‌ నేత ప్రతాప్‌ సింగ్‌ సైతం కాంగ్రెస్‌ లో చేరనున్నట్టు సమాచారం. వీరి రాకను పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరీందర్‌ స్వాగతించారు. భావ సారూప్యత ఉన్న నవజ్యోత్‌ వంటి వారిని తమ పార్టీ అక్కున చేర్చుకుంటుందని, వారి రాకతో, ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ మరింత బలపడిందని అన్నారు. కాగా, సెప్టెంబర్‌ లో కొత్త రాజకీయ పార్టీని పెట్టిన సిద్ధూ ఆపై ఎన్నికలే తమ లక్ష్యమని ఓసారి, ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని మరో సారి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, నవజ్యోత్‌ తరువాత - సిద్ధూ కూడా కాంగ్రెస్‌ లో చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధూ పార్టీ మారడంపై మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News