న‌యీం సినిమా ప్ర‌య‌త్నాలు ఎందుకు చేశాడంటే..

Update: 2016-08-22 22:30 GMT
గ్యాంగ్‌ స్ట‌ర్ న‌యీముద్దీన్ ఒక విష‌యంలో తెలుగుదేశం నాయ‌కుడు దివంగ‌త ప‌రిటాల ర‌విని ఆద‌ర్శంగా తీసుకున్నాడు! ఆ విష‌యం ఏంటంటే.. సినిమా! ప‌రిటాల ర‌వి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న జీవితం ఆధారంగా ర‌క్త చ‌రిత్ర సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ర‌క్త చ‌రిత్ర‌ను రెండు అధ్యాయాలుగా వెండితెర‌పై చూపించారు. ఈ చిత్రాలు న‌యీముద్దీన్‌ కి తెగ న‌చ్చేశాయ‌ట‌. మ‌ర‌ణించాక ప‌రిటాల ర‌వి జీవితం తెర‌పైకి వ‌చ్చింది, కానీ బ‌తికుండానే త‌న జీవిత చ‌రిత్ర‌ను తెర‌మీద చూసుకోవాల‌ని న‌యీముద్దీన్ ఆశ‌ప‌డ్డాడ‌ట‌! ఆశ మాత్ర‌మే కాదు.. ఆచ‌ర‌ణ కూడా మొద‌లుపెట్టాడట‌. న‌యీం ఎన్‌ కౌంట‌ర్ అనంత‌రం ద‌ర్యాప్తు బృందం తీగ లాగుతున్న కొద్దీ కొత్తకొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో న‌యీం సినిమా ప్ర‌య‌త్నాలు కూడా బ‌య‌ట‌కి వ‌చ్చాయి!

త‌న జీవితం మీద ఒక సినిమా తీయాల‌ని ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడిని న‌యీం క‌లిశాడ‌ట‌. తాను న‌క్స‌లైట్‌ గా ఎందుకు మారిందీ, ఆ త‌రువాత జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల‌ను తెర‌కెక్కించ‌మ‌న్నాడ‌ట‌. అయితే, ఈ క్ర‌మంలో త‌న జీవితంలోని చీక‌టి కోణాల‌ను ఏమాత్రం ట‌చ్ చేయ‌కూడ‌ద‌ని కూడా కండిష‌న్ పెట్టాడు. క‌థ తానే ఇస్తాన‌ని చెప్పాడ‌ట‌. త‌న చిత్రం కోసం నిర్మాత‌ను కూడా తానే చూస్తాన‌ని కూడా ఆ ద‌ర్శ‌కుడికి భ‌రోసా ఇచ్చాడ‌ని చెబుతున్నారు. త‌న జీవిత క‌థ‌పై వ‌స్తున్న చిత్రంలో న‌టించేందుకు న‌యీం ఆస‌క్తి చూప‌లేద‌ట‌, వేరే హీరోని  వెతికిపెట్ట‌మ‌ని ఆ బాధ్య‌త‌లు ద‌ర్శ‌కుడికే అప్ప‌గించాడ‌ట‌. అయితే, ఆ త‌రువాత ఈ చిత్రం తెర‌కెక్కించేందుకు స‌ద‌రు ద‌ర్శ‌కుడు నిరాక‌రించాడ‌ని చెబుతున్నారు.

నిజానికి, ఈ సినిమా త‌రువాత పొలిటిక‌ల్ ఎంట్రీ ఇద్దామ‌ని న‌యీం అనుకున్నాడని స‌మాచారం. 2019లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి నుంచి పోటీ చేయాల‌ని న‌యీం ప్లాన్ చేశాడ‌న్న వార్త‌లు కూడా ఈ మ‌ధ్య వినిపించాయి. రాజకీయాల్లోకి వ‌చ్చే ముందు ఇలా సినిమా ద్వారా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం వ‌ర్కౌట్ అవుతుంద‌ని న‌యీం అనుకున్నాడ‌ట‌!
Tags:    

Similar News