ఎంచక్కా తినేస్తే.. రూ.లక్ష ఇస్తానంటున్న నాయుడుగారి కుండ బిర్యానీ రెస్టారెంట్

Update: 2022-02-20 05:49 GMT
అందరు నడిచే దారిలో నడిస్తే కిక్ ఏముంటుంది? సరిగ్గా ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు విజవాడకు చెందిన నాయుడుగారి కుండ బిర్యానీ రెస్టారెంట్ యజమానులు. ఇద్దరు యువకులు స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్ సరికొత్త సవాలు విసిరి.. ఫుడ్ లవ్వర్స్ ను తెగ ఆకర్షిస్తోంది. అందరూ తిన్నందుకు డబ్బులు వసూలు చేస్తే.. ఇక్కడ మాత్రం తాము చెప్పినట్లు తింటే ఏకంగా రూ.లక్ష ఇస్తామని ఊరిస్తున్నారు.

ఇందుకోసం తామిచ్చిన తాలీ (భోజనం) తిని పెడితే రూ.లక్ష ఇస్తామని సవాలు విసురుతోంది. ఇందుకోసం ఏం చేయాలన్నది చూస్తే.. వారి వద్ద బాహుబలి తాలీని రూ.1499కు అందజేస్తున్నారు. దాన్ని అరగంటలో ఫినిష్ చేస్తే రూ.లక్ష బహుమానంగా ఇస్తామంటూ సవాలు విసురుతున్నారు.

ఇంతకీ ఈ బాహుబలి తాలీలో ఏముంటాయన్న విషయానికి వస్తే..

-  నాయుడుగారి కుండ బిర్యానీ
-  చికెన్ ఫ్రైడ్ రైస్
-  షెజ్వాన్ నూడుల్స్
-  వెజ్ ధమ్ బిర్యానీ
-   ప్రాన్ మసాలా
-   మటన్ కర్రీ
-  చికెన్ ఫ్రై
-  చికెన్ జాయింట్
-  చికెన్ వింగ్
-  పనీర్ మెజిస్టిక్
-  మష్రూమ్ మంచూరియన్
-  చిల్లీ చికెన్
-  నాటుకోడి
-  ఫిష్
-  కౌజు పిట్ట
-  కర్డ్ రైస్
-  రెండు లస్సీలు
-  రెండు సోడాలు
-  వాటర్ బాటిల్
-  గోంగూర కర్రీ
-  ఆనియన్స్
-  ఆమ్లెట్
-  ఫ్రైడ్ ఎగ్
-  బాయిల్డ్ ఎగ్.. (మొత్తం 30 ఐటెమ్స్ ఉంటాయి

ఈ ఐటెమ్స్ ను కేవలం 30 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. చెప్పిన సమయంలోపు తినేస్తే రూ.లక్ష నజరానాగా ఇస్తారు. ఒకవేళ తినలేని పక్షంలో రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది.

విజయవాడకు చెందిన వర నాయుడు.. సత్యనారాయణ అనే ఇద్దరుయువకులు ఈ కొత్త కాన్సెప్టునుతెర మీదకు తీసుకొచ్చారు. ఈ భారీ భోజన మెనూను టైంకు పూర్తి చేసిన రియల్ భీములకు లక్షరూపాయిల్ని నజరానాగా ఇస్తామన్న ప్రకటనతో ఇప్పటివరకు దాదాపు 500 మందికి పైనే సవాలు స్వీకరించారు.

ఇటీవల ఈ సవాలును ఒక్కరు మాత్రమే సక్సెస్ ఫుల్ గా ఛేజ్ చేశాడు. అతగాడికి రూ.లక్ష ఇచ్చారు. ఏమైనా.. టెంప్టు చేసే సవాలును విసిరిన ఈ రెస్టారెంట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News