రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఒకరని మించిన వాళ్లు మరొకరు ఉంటారు. ఇక ప్రత్యర్థులపై విరుచుకు పడి - అసలు అతనికి మాట్లాడనివ్వకుండా చేయడంలో టీడీపీ అన్ని పార్టీల కంటే ముందే ఉంటుంది. చంద్రబాబుని ఎవ్వరైనా ఒకమాటగా విమర్శిస్తే చాలు… మంత్రుల దగ్గర నుంచి గల్లీ లీడర్ల వరకు అందరూ రెస్పాండ్ అవుతారు. అందుకే.. టీడీపీ ధాటికి చాలా పార్టీలు ఎదురుండలేవు. కానీ టీడీపీకి గట్టి సమాధానం చెప్పి - ప్రస్తుతం కూడా చెప్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే బీజేపీయే. అందుకే.. ఇన్నాళ్లు సోము వీర్రాజు - జీవీఎల్ - మాణిక్యాలరావు లాంటి వాళ్లు.. టీడీపీని - చంద్రబాబు నాయుడ్ని ఏకిపారేశారు. అప్పుడప్పుడు మోదీ కూడా చురకలు అంటిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. చంద్రబాబు నిజస్వరూపం తెలిసిందని.. ఇక ఆయన ఎన్టీయోలోకి వస్తానన్నా రానిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా నిర్వహించిన ఓ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. బీజేపీ - ఎన్డీయే ప్రస్తావన ఎప్పుడు వచ్చినా చంద్రబాబు ఒకటే చెప్తుంటాడు. అసలు ఎన్డీయేకు కారణం తానేనని - వాజ్ పేయిని ప్రధానిగా చేసింది కూడా చెప్తుంటాడు. దీంతో.. అసలు చంద్రబాబు మూలాల్లోనే కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయినా అమిత్ షా.. ఇకనుంచి ఎన్డీయేకు - చంద్రబాబుకి సంబంధం లేదని తేల్చేశారు. ఇకమీదట వస్తానన్నా రానిచ్చే ప్రసక్తే లేదని అన్నారు. బీజేపీకి ఏపీలో పెద్దగా ప్రజాదరణ లేదు. గతంలో ఒకటి రెండు సీట్లు వచ్చినా.. ఇప్పుడు అవి కూడా రావని వారికి తెలుసు. అందుకే చంద్రబాబుపై డైరెక్ట్ ఏటాక్ మొదలుపెట్టారు. ఇప్పుడు అమిత్ షానే ఇలా అంటే.. రేపు 10వ తారీఖున మోదీ వస్తున్నాడు. ఆయనెన్ని చురకలు అంటిస్తాడో.