బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122 ను ఎన్డీయే సాధించింది. ప్రసుత్తం 125 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎంజీబి కూటమి 111 చోట్ల లీడింగ్ లో ఉన్నది. ఇతరులు 07 చోట్ల లీడింగ్ లో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 122 స్థానాల మార్క్ ను ఎన్డీయే సాధించడంతో, కూటమిలోని పార్టీల కార్యాలయాల వద్ద నేతలు, అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రధాని మోడీ కూడా ఇదే విషయాన్ని సభల్లో చెప్పిన సంగతి తెలిసిందే.