టీడీపీలోకి ఔట్‌డేటెడ్ మాజీ ఎమ్మెల్యేలు దాదాపు వంద మంది అట‌!

Update: 2021-04-24 09:30 GMT
క‌రోనా స‌మ‌యంలో టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు.. ఇంట్లో కూర్చొన్నారు. ఇటీవ‌ల తిరుప‌తి పార్ల‌మెంటు ఉపఎన్నిక‌లో విస్తృతంగా ఎనిమిది రోజులు ప్రచారం చేసిన చంద్ర‌బాబు.. ఇప్పుడు హైద‌రాబాద్‌లోని ఇంట్లోనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఏపీలో దూసుకుపోతున్న సీఎం జ‌గ‌న్‌కు ఎలా చెక్ పెట్టాలి? అనే విష‌యంపై పెద్ద ఎత్తున ఆలోచ‌న చేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప‌రిస్థితిపై గ్రామీణ రాజ‌కీయాల్లో ఒక విధ‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

నాయ‌కుల‌తో సంబంధం లేకుండా నేరుగా ప్ర‌జ‌లకు సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. వివిధ ప‌థ‌కాల రూపంలో ప్ర‌జ‌లు డ‌బ్బులు నేరుగా అందిస్తున్నారు. దీంతో జ‌గ‌న్‌కు నాయ‌కుల‌కు మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంద‌నే చ‌ర్చ‌సాగుతోంది. ఇది ఒక విధంగా చూస్తే.. అమెరికా వంటి దేశాల్లో అమ‌ల‌వుతున్న విధానం. అయితే.. మ‌న ద‌గ్గ‌ర వ‌ర్క‌వుట్ కాదు. అయినా.. కూడా జ‌గ‌న్ ఇవేవీ ప‌ట్టించుకోకుండా తాను తీసుకువ‌చ్చిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ఇదే విష‌యాన్ని గ్రామీణ రాజ‌కీయ నేత‌లు చ‌ర్చిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు.. దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది. అంటే.. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎలాగూ రారు కాబ‌ట్టి 2014 ఎన్నిక‌ల‌కు ముందు అనుస‌రించిన వ్యూహాన్నే తెర‌మీదికి తెచ్చి అమ‌లు చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఓడిపోయిన త‌ర్వాత‌.. కాంగ్రెస్‌లో ఓడిపోయిన ఎమ్మెల్యేల‌ను త‌న‌ద‌గ్గ‌ర‌కు తీసుకుని విజ‌యం సాధించారు. ఇప్పుడు కూడా ప్ర‌తి జిల్లాకు ముగ్గురు నుంచి న‌లుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఔట్‌డేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

వీరిని పార్టీలోకి తీసుకోవాల‌ని, ఎలాగూ వారిపై మ‌చ్చ‌లేదు కాబ‌ట్టి.. వైసీపీని టార్గ‌ట్ చేయ‌డానికి వీరైతే.. స‌రైనోళ్లు అని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, 2019 ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత వైసీపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ మాజీ నేత‌ల‌కు ఎలాగూ జ‌గ‌న్ ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. సో.. ఇలాంటి వారిని త‌న‌కు చేరువ చేసుకోవ‌డం ద్వారా వారి ఇమేజ్‌తో పార్టీని డెవ‌ల‌ప్ చేసుకునేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. వీరి వ‌ల్ల టీడీపీ ఓటు బ్యాంకు కూడా పెరుగుతుంద‌ని అనుకుంటున్నారు.

2024 ఎన్నిక‌ల నాటికి.. ఈ మాజీ వ‌ల్ల పార్టీకి ఉప‌యోగం ఉంటుంద‌ని భావిస్తే.. ఖ‌చ్చితంగా వారి వార‌సుల‌కు ప్రాధాన్యం ఇచ్చి.. మేనేజ్ చేయొచ్చ‌ని బాబు అనుకుంటున్నార‌ట‌. సో.. ఇదే విష‌యాన్ని వారికి చెప్పి .. ఒప్పించి.. పార్టీలోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడున్న నేత‌త‌లు పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నా.. వ్య‌క్తిగ‌త స్వార్థాలు పెరిగిపోయాయి. దీంతో పార్టీని నాశ‌నం చేస్తున్నార‌ని.. చంద్ర‌బాబు అనుకుంటున్నారు.

దీనికితోడు .. ఈ మ‌ధ్య త‌న వార‌సుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌తో అనేక మంది పెద్ద నేత‌లు విభేదిస్తున్నారు. దీంతో ఇలాంటి వారికి కూడా చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బాబు అనుకుంటున్నారు. ఇది కొత్త నేత‌ల‌తోనే సాధ్యం అవుతుంద‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ట‌. ఈ క్ర‌మంలో కొత్త నేత‌లు తీసుకువ‌చ్చి.. పార్టీ త‌ర‌ఫున మీడియాలో మాట్లాడిస్తే.. ఎలా ఉంటుంది.. పార్టీ ఇమేజ్ ఏ రేంజ్‌లో పెరుగుతుంద‌ని లెక్క‌లు వేసుకుంటుట‌న్నార‌ట‌. మ‌రి ఏం చేస్తారో.. ఇదెలా వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి. 
Tags:    

Similar News