నెహ్రూ గుట్లు బయటపెట్టిన పుస్తకం

Update: 2015-06-25 10:47 GMT
దేశ ప్రథమ ప్రధాని జవ హర్‌లాల్‌ నెహ్రూపై తాజాగా ఒక వివాదాస్పద పుస్తకం వెలువడింది. ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ ఆ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు ఒక సందర్భంలో నెహ్రూ అబద్ధమాడారని తాజాగా విడుదలైన ఆ పుస్తకం పేర్కొంటోంది. ఇంటెలిజెన్స్‌ శాఖ మాజీ అధికారి ఆర్‌ ఎన్‌పీ సింగ్‌.. %''%నెహ్రూ : ఏ ట్రబుల్డ్‌ లెగసీ%''% అనే పుస్తకంలో ఈ విషయం వెల్లడించారు.

సింగ్‌ తన పుస్తకంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్‌ లేఖలు.. వాటిలోని అంశాలను ప్రచురించారు.  ఆ పుస్తకం ప్రకారం 1949 సెప్టెంబర్‌ 10న రాజేం ద్ర ప్రసాద్‌కు నెహ్ర్రూ ఒక లేఖ రాశారు. దానిలో రాజగోపాలాచారిని ప్రథమ రాష్ట్రపతి చేయడమే ఉత్తమమైన మార్గమని తాను (నెహ్రూ), పటేల్‌ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆ త ర్వాత సర్దార్‌ పటేల్‌, రాజ్యాంగ అసెంబ్లీ సభ'ు్యల అభి ప్రాయాలకు ఇది భిన్నంగా ఉండడంతో నె హ్రూ తనకు అబద్ధం చెప్పారని రాజేంద్ర ప్రసాద్‌ తీవ్ర వ్యధకు గుర య్యారు. ఆయన తనకు నెహ్రూ రాసిన లేఖను పటేల్‌కు పంపించగా.... నెహ్రూ తనతో ఆ విషయం చర్చించనే లేదని పటేల్‌ చెప్పడంతో గుట్టు బయటపడింది.

ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్‌ నెహ్రూ తీరుకు నిరసనగా సెప్టెంబర్‌ 11న నెహ్రూకు లేఖ రాశారు. పార్టీలో తనకున్న హోదా మేరకు తనకు మెరుగైన స్థానం ఇవ్వడంలో తప్పు లేదని రాజేంద్ర ప్రసాద్‌ ఆ లేఖలో నెహ్రూకు స్పష్టపరిచారు. ఆ లేఖ అం దుకున్న నెహ్రూ తన అబద్ధం బయటపడిందని తాను చేసిన తప్పును ఒప్పుకున్నారని సింగ్‌ పేర్కొన్నారు. అయితే ఆయన నేరుగా ఆ విషయాన్ని వ్యక్తం చేయ కుండా, రాజేంద్రప్రసాద్‌ తనను, పటేల్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని ఒక లేఖ రాశారట... మొత్తానికి నెహ్రూ అలా రాజకీయాలు నడిపించారన్నమాట. తాజాగా విడుదలైన ఈ పుస్తకం ఎంత దుమారం రేపుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News