కొన్ని వారాలుగా పక్కనున్న నేపాల్ రెచ్చిపోతుంది. ఎప్పుడు భారత పక్షాన ఉండే ఈ చిన్న దేశం ఇప్పుడు భారతదేశానికే ఝళక్‌లు ఇస్తోంది. చైనా అండ చూసుకుని ఈ దేశం ఇష్టారీతిన వ్యవహారిస్తోంది. తాజాగా నేపాల్ దుస్సాహసం చేసింది. భారత్‌లోని లింపియాదుర, లిపులేఖ్, కాలాపానీ భూభాగాలను తమ దేశానికి చెందినవని పేర్కొంటూ కొత్తగా పొలిటికల్ మ్యాప్‌ను రూపొందించింది. ఆ మ్యాప్ రూపొందించి ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ ఆమోదం కోసం బిల్లు కూడా సిద్ధం చేసింది.
కొత్తగా రూపొందించిన మ్యాప్ కోసం పార్లమెంట్ ఆమోదించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరిగా చేయాలి. కొత్త నేషనల్ ఎంబ్లమ్‌లోని నూతన మ్యాప్ కి అనుగుణంగా నేపాలీ రాజ్యాంగంలోని 3 వ అధికరణాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రతినిధుల సభ మంగళవారం తీసుకువచ్చింది. ఎగువ సభ లేదా నేషనల్ అసెంబ్లీ కూడా ఈ బిల్లును ప్రవేశ పెట్టాలి. ఈ బిల్లులు ఆమోదం పొందితే భారత్‌లోని భూభాగాలు అధికారికంగా తమ దేశంలోకి తీసుకున్నట్లు భావిస్తోంది. అయితే ఈ రాజ్యాంగ సవరణపై స్పందించేందుకు నేపాల్ ఎంపీలకు 72 గంటల సమయం ఇచ్చారు. ఎంపీల స్పందనను బట్టి ఇది ఆమోదం పొందినట్టు ప్రకటిస్తారు.
నాలుగైదు రోజుల్లో దీన్ని ఆమోదిస్తే.. ఇదే ప్రొసీజర్‌ని నేషనల్ అసెంబ్లీ కూడా పాటిస్తుంది. ఈ విషయంపై నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు బిష్ణు రిజాల్ ట్విటర్‌లో స్పందించారు. తమ దేశ భూభాగాలను తాము వదులుకునే ప్రసక్తి లేదని నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి ఇదివరకే ప్రకటించారని గుర్తుచేశారు. ఈ బిల్లును ఆమోదించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ దేశంలో ఈ మ్యాప్ రూపొందించడమే కాకుండా ఏకంగా ఆమోదం కూడా చేయనున్నారు. ఇంత జరుగుతున్నా భారతదేశం స్పందించడం లేదు. నేపాల్ విషయం పై ఎటూ తేల్చడం లేదు.