ఔను! ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలి. ముఖ్యంగా చంద్రబా బు.. అసెంబ్లీ సాక్షిగా చేసిన శపథం.. నెరవేరాలంటే.. ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలి. అం దుకే.. అవకాశం ఉన్న ప్రతి విషయంలోనూ.. చంద్రబాబు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయి తే.. చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద సమస్యలు చుట్టుముడుతున్నాయి. సొంత పార్టీలోనే కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. పార్టీనిఅనూహ్యమైన ఇబ్బందుల్లో పడేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
ఏ పార్టీ అయినా.. అధికారంలోకి రావాలంటే.. ప్రజల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. ముఖ్యం గా.. నాయకులు ఎంతటి బలవంతులైనా కావొచ్చు.. ఎంత ఆర్థిక స్థితిలో అయినా ఉండొచ్చు. కానీ, ప్రజల విషయానికి వస్తే.. డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా వ్యవహరించాలి. కానీ, టీడీపీనేతలు కొందరు.. తమకు తిరుగు లేదు.. తమ మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. పార్టీ అధినేత కూడా తమ మాట ను తీసేయడు.. ఆయన అలా కాదంటే రాజకీయాల నుంచి తప్పుకొంటా! అంటూ.. కొందరు యువ నేతలే వ్యాఖ్యానించడం.. ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
మరికొందరు.. పైకి ఏమీ అనకున్నా.. తమ పంథాలో తాము పయత్నిస్తున్నారు. ఇది కూడా పార్టీని ఒంటరి గా నిలబెడుతున్న పరిస్థితిని తెస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతున్న తరుణంలో పార్టీ పరిస్థితి తిరోగమన దిశగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఏ పార్టీలో అయినా.. అధినేత మాటే శిరోధార్యం.. అనే మాట బలంగా ఉంటే తప్ప..పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగే అవకాశం తక్కువ. పైగా.. నాయకు ల బాట తలోదారి.. అనుకున్నా.. ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలోనే గత ఎన్నికలకు ముందు ఏ దెబ్బ అయితే... తిందో.. ఇప్పుడు టీడీపీ అదే బాటలో నడుస్తోందని అంటున్నారు.
గతంలోనూ ఎవరికివారు ఇష్టానుసారంగా వ్యవహరించారు. తమకు నచ్చిన దారిలో నడిచారు. ఫలితంగా అధినేతకు, నాయకులకు మధ్య లింకు తెగిపోయింది. ఇది ఎన్నికల్లో వంగి వంగి దణ్ణాలు పెట్టే పరిస్థితిని తీసుకువచ్చింది. అయినప్పటికీ.. ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించలేదు. ఇప్పుడు.. కూడా అదే పరిస్థితి మళ్లీ వచ్చేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా ...చంద్రబాబు పార్టీలో క్రమశిక్షణను కట్టుదిట్టం చేస్తారా.. లేదా.. చూడాలి.