పైసా ఖర్చు లేకుండా చేయగలిగిన పని ఏమైనా ఉంటుందంటే.. అది నీతులు చెప్పటమే. వెనుకా ముందు చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగామాట్లాడటం రాజకీయపార్టీ అధినేతలకు మామూలే. చేసిన తప్పుల్ని ఇట్టే గుర్తుకు వచ్చేలా మాట్లాడటం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. ప్రత్యర్థులపై వేలెత్తి చూపించేందుకు తెగ ఉత్సాహాన్ని ప్రదర్శించే చంద్రబాబు.. మిగిలిన నాలుగు వేళ్లు తననే చూపిస్తాయన్న చిన్న విషయాన్ని ఆయన తరచూ మర్చిపోతుంటారు. అడ్డంగా బుక్ అవుతుంటారు. తాజాగా ఆయన మాటలు ఇదే తరహాలో ఉన్నాయి.
కరోనా టైంలో హైదరాబాద్ కే పరిమితమైన టీడీపీ అధినేత చంద్రబాబ.. ఎట్టకేలకు తాజాగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘‘సాధన దీక్ష’’లో మాట్లాడారు. తనకు అలవాటైన రీతిలో జగన్ సర్కారుపై విమర్శలు.. ముఖ్యమంత్రిపై ఘాటువ్యాఖ్యలతో పాటు.. నీతులు చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పటిలా తనకు తానే బుక్ అయ్యేలా చేసుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చూసైనా నేర్చుకోవాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చురకలేశారు చంద్రబాబు.ఆ ఉత్సాహంలో ఆయన పాత విషయాల్ని మర్చిపోయారు. దాని గురించి చెప్పే ముందు.. బాబు చెప్పిన మాటల్ని ఆయన మాటల్లోనే చెబితే.. ‘‘అమ్మ క్యాంటీన్ల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యవహరించిన తీరును జగన్ రెడ్డి చూడాలి. ఆయన నుంచి నేర్చుకోవాలి. అమ్మ క్యాంటీన్లు మంచి ఉద్దేశంతో పెట్టారని.. వాటిని తీసేయటం సరికాదంటూ జయలలిత ఫోటోలతోనే వాటిని కొనసాగిస్తున్నారు. డీఎంకే కార్యకర్తలు ఆ క్యాంటీన్లపై దాడి చేస్తే వారిపై కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకున్నారు. ఏపీలో మాత్రం పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మూయించేశారు’’ అని మండిపడ్డారు.
బాబు మాటలు విన్నంతనే వేమన పద్యం మాదిరి మధురంగా వినిపిస్తుంది. కానీ.. కాస్తంత లోతుల్లోకి వెళితే.. ఆయన మాటల్లో ఉత్త డొల్లతనం కనిపిస్తుంది తప్పించి మరింకేమీ ఉండదు. చంద్రబాబు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కానీ.. వైఎస్ హయాం తర్వాత పవర్లోకి వచ్చినప్పుడు కానీ.. అంతకు ముందు ప్రభుత్వం అమలు చేస్తున్న పాపులర్ పథకాల్ని తన పేరు మీదకు మార్చుకోవటం తెలిసిందే. వైఎస్ హయాంలో 108అంబులెన్సుల వ్యవస్థ ఎంత అద్భుతంగా పని చేసింది తెలిసిందే.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత మహానేత వైఎస్ ఫోటోల్ని తీసిపారేసిన వైనానికి బాబుఏమని సమాధానం చెబుతారు. ఇవాల్టి రోజున స్టాలిన్ ఉదంతాన్ని చూపించి.. అలా చేయొచ్చుగా? అని ప్రశ్నించే ముందు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశానన్న విషయాన్ని కాస్తంతైనా గుర్తు చేసుకొని ఉంటే.. బాబు నోటి నుంచి ఈ తరహా మాటలు వచ్చేవి కావేమో? కెలికి మరీ తిట్టించుకోవటం అంటే ఇదేనేమో?