అమెరికాలో తాజాగా నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ పై పోలీసుల జాత్యహంకార దాడి ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను కదిలించింది. భారతీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ వేదనను, నిరాశను వ్యక్తం చేశారు మరియు జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిలబడ్డారు.
అయితే నల్ల జాతీయులు, దేశంలో దక్షిణాది వారిపై కూడా ఇదే వివక్ష కొనసాగుతోంది. మన స్టార్ హీరోలు సైతం నలుపుగా ఉండొద్దు తెల్లబడండి అంటూ ఫెయిర్ నెస్ క్రీములకు ప్రకటనల్లో నటిస్తున్నారు.వాటికి ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఇదే ఆ తారలపై ఆగ్రహానికి కారణమవతోంది. అమెరికాలో నల్లజాతీయుడి మరణంపై నీతి సూత్రాలు వల్లెవేస్తున్న తారలు.. అదే ఇండియాలో ఫెయిర్ నెస్ క్రీములతో తెల్లబడండని.. నలుపు రంగు మనషులకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల సంస్థలు ఆసియాలోని నలుపు, చామను చాయ ప్రజలు మరింత తెల్లగా మారాలంటే మా ఉత్పత్తులు కొనాలని పెద్ద ప్రచారం చేస్తున్నాయి. ఆసియా ప్రజల రంగు వల్ల వారి అభద్రతల నుండి కూడా చాలా లాభం పొందుతున్నాయి. షారుఖ్ ఖాన్ వంటి నటులు ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, గార్నియర్ లైట్ అల్ట్రాతో ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్ లో రియల్ వైట్ పర్ఫెక్ట్ మరియు దిషా పటాని విత్ పాండ్స్ స్పాట్లెస్ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు పూసుకుంటే తెల్లబడుతారని ప్రకటనల్లో నటిస్తున్నారు. నల్లగా ఉండడంపై అందులో వివక్షను చూపిస్తున్నారు. హాస్యాస్పదంగా, ఈ ప్రముఖులందరూ అమెరికాలో హత్యకు గురైన నల్లజాతీయుడు ఫ్లాయిడ్ విషయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా గళం విప్పడం విశేషం. ఇప్పుడు నెటిజన్లు మన సెలెబ్రెటీల ద్వంద్వ నీతిపై మండిపడుతున్నారు.
ఈ మేరకు ట్విట్టర్ లో నెటిజన్లంతా తారలపై ‘సెలెక్టివ్ యాక్టివిజం’ అని హ్యాష్ ట్యాగ్ లో నిలదీస్తున్నారు. ‘బ్లాక్‌లైవ్స్‌మాటర్’ అంటూ మరో హ్యాష్ టాగ్ తో ట్రెండింగ్ చేస్తున్నారు. ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల భావన జాత్యహంకారం నుండి వచ్చినది కాదా? అంటూ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. నల్లజాతీయులపై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నెటిజన్లు మన తారల తీరుపై విరుచుకుపడుతున్నారు.
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే దేశంలోని ప్రముఖలందరూ కోట్ల రూపాయల పారితోషకం తీసుకొని ఈ ఫెయిర్ నెస్ క్రీముల ఉత్పత్తుల తరుఫున ప్రచారం చేశారు. అయితే ఇప్పుడిది జాత్యాహంకార రూపంలో మారడంతో ఈ యాడ్స్ నుంచి వైదొలుగుతారా? కోట్ల రూపాయలు వదులుకుంటారా? అనేది వేచిచూడాలి.