చినబాబు లాంటి ఒక్క కొడుకు చాలు.. తిట్టించుకోవటానికి. చినబాబుకు ఎక్కడ ట్రైనింగ్ ఇప్పించారో కానీ..కరెక్ట్ గా ప్రత్యర్తులకు ఆయుధం అయ్యేలా మాట్లాడటం చినబాబుకు మాత్రమే సాధ్యమవుతుందేమో. ఎవరైనా మాట్లాడినా.. ట్వీట్ చేసినా ప్లస్ కావాలే కానీ మైనస్ కాకూడదు. కానీ.. లోకేశ్ రూటు మాత్రం సపరేటు. చినబాబు మాట్లాడితేనే కాదు.. ట్వీట్ చేసినా రచ్చ రంభోలేనన్న వైనం తాజాగా తేలిపోయింది.
చాలామంది లోకేశ్ నోటి నుంచి వచ్చిన మాటల్లోని తప్పులు పట్టుకొని అదే పనిగా పీకి పాకాన పెడుతుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ఒళ్లు మండిపోతుంది. చిన్న కుర్రాడు.. కష్టపడి పార్టీ కోసం ఆ రకంగా పని చేస్తూ.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అనవసరమైన హడావుడిని నివారించి.. పరోక్ష ఎన్నికల ద్వారా ఎమ్మెల్సీ అయి.. ఎంచక్కా మంత్రి అయిపోయిన వైనాన్ని చూసి సంతోషపడాలా లేదా?
అదేమీ లేకుండా.. చినబాబు మాటల్లో తప్పుల్ని ఎత్తి చూపటంలో ఏమైనా న్యాయం ఉందా? మహా అయితే.. మరో పదేళ్లు తప్పులు మాట్లాడకుండా ఉండటం ఎలానో నేర్చుకుంటారని సర్ది చెప్పుకోలేని ఆశ పరుల మనసుల్ని అర్థం చేసుకోకుండా అదే పనిగా వేలెత్తి చూపటంలో ఏమైనా న్యాయం ఉందా? అని బాబువర్గీయులు చినబాబును అదే పనిగా వెనకేసుకొస్తుంటారు.
నిజమే.. అలాంటి వీర విధేయుల మాటలు విన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. కానీ.. ఈ రోజు చినబాబు చేసిన ట్వీట్ ను చూసినప్పుడు మళ్లీ బోలెడన్ని అనుమానాలు. మాట్లాడటం అంటే అదో కళ. అలా అబ్బటానికి చాలానే ఉంటుంది. కానీ.. చేతిలో ఉన్న ఫోన్లో మెసేజ్ టైప్ చేయటానికి.. విమర్శకులు.. ఎటకారం చేసేటోళ్లకు అవకాశం ఇవ్వకుండా ట్వీట్ చేయాలన్న విషయాన్ని కూడా చినబాబుకు చెప్పాలా? ఇంతకీ లోకేశ్ పెట్టిన అంత అద్భుతమైన ట్వీట్ ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఫోటోగా పెట్టి.. దానికి క్యాప్షన్ గా నవ్యాంధ్రలో మళ్లీ చంద్రోదయమే అంటున్న అన్నగారు అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ఎటకారంగా మారింది. ఎందుకంటే.. ఏపీ టీడీపీ ఆఫీసులో ఉన్న ఎన్టీఆర్ బొమ్మ చేతి సందులో అల్లంత దూరాన ఉన్న చందమామ.. చూసినంతనే అన్నగారి చేతిలో ఉన్నట్లుగా ఉంటుంది. దానికి లోకేశ్ లోని కళాకారుడు స్పందించి.. చంద్రోదయంగా కీర్తించారు.
ఇక్కడ మిస్ అయిన లాజిక్ ఏమంటే.. నిండు పూర్ణమిగా ఉన్న చంద్రుడు ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. చంద్రుడు నెలవంకలా సన్నగా ఉండటం అంటే.. అమవాస్యకు ముందు అన్నట్లుగా ఉంది. అలాంటప్పుడు చంద్రోదయం అనే కన్నా.. మరో అర్థం వచ్చేలా ఉందని చెప్పక తప్పదు. మరీ విషయాన్ని లోకేశ్ బాబు ఎలా మిస్ అయ్యారో అర్థమే కాదు. లోకేశ్ కు అర్థం కాని ఈ పాయింట్ ను నెటిజన్లు పట్టుకున్నారు. ఉతికి ఆరేశారు. అప్పుడెప్పుడో అన్నగారిని దొడ్డిదోవన పొడిచిన వెన్నుపోటు వైనాన్ని గుర్తుకు తెచ్చి మరీ ఎటకారం చేసేసుకున్నారు. ఈ ఎపిసోడ్ అంతా చూసినప్పుడు కదిలించి కడుపు నిండా పెట్టించుకోవటం అంటే ఎలా? అన్నది లోకేశ్ బాబును చూసి నేర్చుకోవాల్సిందేనని చెప్పక తప్పదు. లోకేశా.. మజాకానా!