ఏపీలో విపక్షాలు దూకుడు మీద ఉన్నాయి. అవి చెప్పినవి నిజాలా అబద్ధాల అన్నది పక్కన పెడితే బలమైన మీడియా వాటిని విపరీతంగా జనాల్లోకి తీసుకుపోతోంది. మరో వైపు చూసుకుంటే అధికార వైసీపీకి మీడియా మద్దతు చాలా తక్కువ అనే చెప్పాలి. ఏపీ సర్కార్ అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నా కూడా ఎక్కడా వాటి మీద ప్రచారం ఉండడంలేదు అదే సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని బూతద్ధం లో చూపిస్తున్నారు. దీంతో అది బాగా చర్చకు తావిస్తోంది.
ఇన్నాళ్ళు మనకెందుకీ ప్రచారం అనుకున్నా ఇపుడు సగం పాలన పూర్తి అయ్యాక వైసీపీ సర్కార్ పెద్దలకు వాస్తవాలు అర్ధమవుతున్నాయట. తాము చేస్తున్న పనులను జనాల్లో పెట్టే బలమైన మీడియా అవసరాన్ని వారు గుర్తించారు అంటున్నారు. జగన్ కి సొంతంగా ఒక మీడియా ఉన్న దాని వల్ల పూర్తి స్థాయి ప్రయోజనాలు అందడం లేదు అంటున్నారు. దాంతో సొంత ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారం దిశగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలను పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లడానికి వాటిని ప్రచారం చేయడానికే ఓటీటీ ఏర్పాటు అంటున్నారు. పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో నడిచే ఓటీటీ ఏర్పాటు కోసం అనుమతులు అవసరం. అందుకే జగన్ ఢిల్లీలో ప్రత్యేకంగా సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ని కలిసారు అంటున్నారు. దీనికి సంబంధించి పూర్వరంగం ఇప్పటికే సిద్ధమైనా అనుమతులు తెచ్చుకుంటే వీలైనంత త్వరగా ప్రభుత్వ రంగాన ఓటీటీని కీలకమైన సమాచార వ్యవస్థగా ఏర్పాటు చేయాలన్నది జగన్ సర్కార్ ఆలోచనగా ఉందిట.
మరి కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంగా ఈ మేరకు అనుమతులు కోరారని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి కావాల్సిన లాంచనాలు, మార్గదర్శకాలను అనుసరించి పరిపూర్తి చేయాల్సిన నిబంధలను అన్నీ అయ్యాక తొందరలోనే ఓటీటీ ప్రారంభం అవుతుంది అంటున్నారు. ఓటీటీని కేవలం తమ ప్రభుత్వం వరకే కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయనుండడంతో రానున్న కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఓటీటీ వ్యవస్థను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆయా ప్రభుత్వ కార్యక్రమాలను జనాలలలో చర్చకు పెడుతుంది అంటున్నారు. మొత్తానికి ఓటీటీ ఆలోచన రావడం వినూత్మమే అంటున్నారు. ఇంతకాలం ప్రచారం మీద మోజు లేదు అనుకున్న జగన్ ఇపుడు జనాల్లోకి వెళ్ళి మరీ తాను చేసిన పనులను చెబుతున్నారు. అయితే మీడియాలో మాత్రం పెద్దగా కవర్ కావడంలేదు. మరి సర్కార్ వారి ఓటీటీ ఆ లోటు తీరుస్తుందా అంటే చూడాలి మరి.