నిర్భయ దోషుల్లో కొత్త మార్పు.. అప్రమత్తమైన జైలు సిబ్బంది

Update: 2019-12-14 08:04 GMT
ఎంత పెద్ద తప్పు చేసినా ఫర్లేదు. దోషుల ప్రాణాలు పోకుండా ఉండేలా వకల్తా పుచ్చుకొని పోరాడే మానవహక్కుల కార్యకర్తలు.. కొన్ని సంఘాలు ఉంటాయన్నది తెలిసిందే. వీరికి తోడు దోషులకు వెనువెంటనే శిక్షలు అమలు చేసే సిస్టం సైతం దేశంలో తక్కువే. విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే నిర్భయ ఉదంతంలో దారుణానికి పాల్పడిన దోషులకు శిక్ష విధించటానికి ఇన్నేళ్లు పట్టటం దీనికో ఉదాహరణగా చెప్పాలి.

తాము చేసిన దారుణానికి పశ్చాతాపడటం నిర్భయ దోషుల్లో ఇప్పటివరకూ కనిపించలేదు. నిత్యం సుష్టుగా భోజనం చేసేవారు. క్షమాభిక్ష కోసం పిటిషన్లు పెట్టుకొని బండి లాగించేసేవారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న నిర్భయ హత్య కేసులో దోషులైన పవన్ కుమార్ గుప్తా.. ముకేశ్.. వినయ్ శర్మ.. అక్షయ్ కుమార్ సింగ్ లను ప్రత్యేక జైలు గదుల్లో ఉంచారు.

ఇప్పటికే దోషుల్లో ఒకడైన రాంసింగ్ 2013లో జైల్లోనే ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో.. నలుగురు దోషుల్ని ఉంచిన జైలుగది బయట ప్రత్యేక పహరాను ఏర్పాటు చేశారు. ఇంతకాలం వారిని వెంటాడని చావు భయం తాజాగా ఉరిశిక్షకు డేట్ ఫిక్స్ చేసిన నేపథ్యంలో వారిలో భయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెబుతున్నారు.

గతంలో ఫుల్ గా తినేసిన ఈ నలుగురు.. ఉరిశిక్షను కన్ఫర్మ్ చేసిన నాటి నుంచి సరిగా తినటం లేదని చెబుతున్నారు. వారు తీసుకునే ఆహారాన్ని బాగా తగ్గించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నలుగురికి తమిళనాడుకు చెందిన పోలీసులతో ప్రత్యేక పహరాను ఏర్పాటు చేశారు. కడుపులోని పేగుల్ని లాగి మరీ అత్యాచారం చేసిన ఈ నరరూప రాక్షసులకు ఇప్పటికి కానీ చావు భయం రాలేదంటే.. మన వ్యవస్థ వైఫల్యం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News