ఆ రాష్ట్ర రాజ‌ధానికి వాజ్ పేయి పేరు!

Update: 2018-08-22 04:39 GMT
మాజీ ప్ర‌ధాని.. దేశ రాజ‌కీయాల్లో శిఖ‌రంగా అభివ‌ర్ణించే మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయి ఇమేజ్ ను మ‌రింత పెంచేలా ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్ర సర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఆ రాష్ట్ర రాజ‌ధాని కాబోయే కొత్త రాయ్ పూర్ పేరును అట‌ల్ న‌గ‌రంగా నామక‌ర‌ణం చేయాల‌న్న నిర్ణ‌యాన్ని తాజాగా ఆ రాష్ట్ర స‌ర్కారు తీసుకుంది. వాజ్ పేయి మ‌ర‌ణం నేప‌థ్యంలో పెల్లుబికిన భావోద్వేగం నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌ధాని పేరుతో పాటు.. రాష్ట్ర స‌ర్కారు అమ‌లు చేస్తున్న ప‌లు ప‌థ‌కాల‌కు వాజ్ పేయి పేరు పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్ సింగ్ నేతృత్వంలోని మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకోవ‌టం విశేషం.

వాజ్ పేయి పేరును రాష్ట్ర రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌టం వెను స‌ముచిత‌మైన అంశాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అట‌ల్ హ‌యాంలోనే అని.. అందుకే ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తుగా ఆయ‌న పేరుతో ప‌లు ప‌థ‌కాల్ని షురూ చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

2000లో వాజ్ పేయి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్పుడు త‌మ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశార‌ని.. అందుకు ఆయ‌న పేరును కొత్త రాజ‌ధానికి పెడుతున్నామ‌ని.. అదే స‌మ‌యంలో ఆయ‌న స్మార‌క స్తూపాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. అట‌ల్ పేరును ఏదో నామమాత్రంగా కాకుండా.. పెద్ద ఎత్తున వాడుకునేలా ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది.

వ‌రుస‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ర‌మ‌ణ్ సింగ్ పై ప్ర‌స్తుతం.. ఆ రాష్ట్రంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఈ నేప‌థ్యంలో అట‌ల్ పేరును తెర మీద‌కు తీసుకొచ్చి భావోద్వేగ రాజ‌కీయాలు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఛ‌త్తీస్ గ‌ఢ్ స‌ర్కార్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ర‌మ‌ణ్ సింగ్ త్వ‌ర‌లో చేయ‌నున్న వికాస్ యాత్ర‌కు సైతం అట‌ల్ వికాస్ యాత్ర‌గా పేరు మార్చుతున్న‌ట్లుగా వెల్ల‌డించారు. మొత్తంగా  చూస్తే.. అట‌ల్ నామ‌స్మ‌ర‌ణంతో త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల గండాన్ని గ‌టెక్కించాల‌న్న‌ట్లుగా ఆ రాష్ట్ర స‌ర్కారు తీరు ఉంద‌ని చెప్పాలి.

అట‌ల్ బిహారీ వాజ్ పేయి పేరుతో త్వ‌ర‌లో చేప‌ట్ట‌నున్న అంశాల జాబితాను చూస్తే..

+ రాజ‌ధాని న‌గ‌రం.. అట‌ల్ న‌గ‌ర్‌!

+  రాయ్ పూర్ లోని సెంట్ర‌ల్ పార్క్‌ కు

+ బిలాస్ పూర్ వ‌ర్సిటీలోని మెడిక‌ల్ కాలేజీకి

+ మార్వా థ‌ర్మ‌ల్ ఫ్లాంట్‌ కు..

+ రాయ్ పూర్ ఎక్స్ ప్రెస్ వేకు..

+ ప్ర‌తి ఏటా వాజ్ పేయి పేరిట క‌వుల‌కు జాతీయ పుర‌స్కారాన్ని ఇవ్వాల‌ని

+ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ‌మైన న‌వంబ‌రు 1ను ఉత్త‌మ పాల‌న అందించిన గ్రామ పంచాయితీల‌కు.. మున్సిపాలిటీల‌కు అట‌ల్ బిహారీ వాజ్ పేయి సుహాస‌న్ పుర‌స్కారం

+ వాజ్ పేయి హ‌యాంలో నిర్వ‌హించిన పోఖ్రాన్ అణుప‌రీక్ష‌ల‌కు గుర్తుగా రాష్ట్రంలోని ఒక బెటాలియ‌న్ కు పోఖ్రాన్ బెటాలియ‌న్ గా నామ‌క‌ర‌ణం.


Tags:    

Similar News