కొత్త జిల్లాల ఏర్పాటు పై జగన్ ఇంకా ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు అని అనేందుకు లేదు. కేంద్రం వద్దన్నా కాదన్నా ఒకసారి ఆయన ఫిక్స్ అయ్యారు కనుక వార్ ఒన్‌సైడ్ అవ్వాల్సిందే! ఇప్పుడున్న జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు కలిపి 26 జిల్లాలకు మార్గం సుగమం అయింది.
ఇదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉన్న ఆవశ్యకత ఏంటి అన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇప్పటిదాకా పరిపాలనా సౌలభ్యం కోసమే కదా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసింది. మరి! అవి ఉంటుండగానే జిల్లాల ఏర్పాటు పేరిట హడావుడి ఎందుకు ? అదేవిధంగా జగన్ పాలన పరంగా కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం మినహా ఆయన సాధించేదేమీ ఉండదు అన్నది కూడా సుస్పష్టం. జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లా కో మంత్రిని కూడా ఇస్తున్నారు.
ఇదే దశలో ఉద్యోగుల పంపకం అన్నది ఓ పెద్ద తలనొప్పిగానే ఉంది. మంత్రుల మార్పులు చేర్పులు ఎలా ఉన్నా ఉద్యోగుల విషయమై చాలా తలనొప్పులు ఉన్నాయి. చాలా మంది మన్యం ప్రాంతాలలో పనిచేసేందుకు అస్సలు ఆప్షన్ ను ఎంచుకోవడం లేదు. ముఖ్యంగా రెవెన్యూ వర్గాలు ఇంకా చెప్పాలంటే సీనియర్లు కూడా అటుగా వెళ్లేందుకు నో చెబుతున్నారు. అదేవిధంగా కొత్త కార్యాలయాల ఏర్పాటుకు కూడా ఇంకా చర్యలు చాలా చోట్ల ప్రారంభం కాలేదు.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణాలకు 15 ఎకరాలు సేకరించాలని చెప్పడం ఇంకా విడ్డూరంగా ఉందని, ఉన్న కలెక్టరేట్లకే మరమ్మతులు లేవు అని, కొన్ని చోట్ల ఆర్డీఓ కార్యాలయాలకు అస్సలు కనీస వసతులు కానీ సౌకర్యాలు కానీ లేవని గగ్గోలు పెడుతున్నారు.
ఇదే సమయంలో మంత్రుల నియామకం పూర్తయ్యాక పాలన అన్నది సుగమం అవుతుందని ఏంటి గ్యారంటి? ఇప్పటికీ విశాఖ లాంటి ప్రాంతాలలో పోలీసు కమిషనరేట్ హద్దులు తేలలేదు. శ్రీకాకుళం లాంటి జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాలను కోల్పోయాయి అంటే ఐటీడీఏలను కోల్పోయాయి.
ఈ నేపథ్యంలో జిల్లాకో ఐటీడీఏ ఏర్పాటు సాధ్యమా? ఇక మంత్రి వర్గంలో సీనియర్లకు చోటు మళ్లీ ఉంటే కాస్తో కూస్తో పాలన కూడా సజావుగానే ఉంటుందని, అలా కాకుండా పూర్తి కొత్త ముఖాలతో క్యాబినెట్ నింపినా ప్రమాదమే అన్నవాదన కూడా వినవస్తోంది.