మోస్ట్ అవైటెడ్ ఫోన్ గుట్టు తెలిసిపోయింది

Update: 2016-03-15 09:56 GMT
ప్రపంచంలో ఎన్ని రకాల ఫోన్లు వచ్చినా.. యాపిల్ కంపెనీ తయారు చసే ఐఫోన్లకు ఉండే డిమాండే వేరు. ఈ కంపెనీ కొత్త మోడళ్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. యాపిల్ సంస్థ ఐఫోన్ సిరీస్ లో భాగంగా విడుదల చేయబోయే స్పెషల్ ఎడిషన్ (ఐఫోన్ ఎస్ ఈ) కోసం అలాగే ఎదురు చూస్తున్నారు జనాలు. ఐతే యాపిల్ సంస్థ అధికారికంగా దీని విశేషాలు వెల్లడించకముందే ఈ ఫోన్ గుట్టు లీకైపోయింది. ఈ ఫోన్ ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. చైనాకు చెందిన ఓ మీడియా కంపెనీ విడుదల చేసింది. ఈ ఐఫోన్ ఎస్ ఈ మోడల్ రోజ్ గోల్డ్ రంగులో ఉండబోతోంది.

2013లో వచ్చిన ఐ ఫోన్ 5ఎస్ తరహాలో నాలుగు అంగుళాల సైజులో కొత్త ఐఫోన్ రాబోతోందని వచ్చిన వదంతులు వాస్తవమే అని ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. అలాగే గత ఏడాది విడుదల చేసిన ఐఫోన్ 6ఎస్ తరహాలో ఫోన్ మూలలు గుండ్రంగా ఉండేలా ఐఫోన్ ఎస్ ఈ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 21న ఐఫోన్ ఎస్ ఈ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఫోన్ విశేషాలు కూడా ఆ రోజే తెలియబోతున్నాయి. ఈ ఫోన్ ప్రధాన కెమెరా 12 మెగా పిక్సెల్స్ ఉంటుందని.. ఫ్రంట్ కెమెరా 5 మెగా పిక్సెల్ అని చెబుతున్నారు. ఏ 9 ప్రాసెసర్ - ఆపిల్ పే చెల్లింపుల కోసం నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్ (ఎన్ ఎఫ్ సీ) - 16 జీబీ ఇంటర్నల్ - 64 జీబీ ఓవరాల్ స్టోరేజ్ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి. మార్చి 25 నుంచి అమ్మకాలు ఆరంభమయ్యే అవకాశముంది.
Tags:    

Similar News