యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు నిజాలు బయటకు తీస్తున్నారు. పబ్ సీసీ ఫుటేజీ ఆధారంగా డ్రగ్ పెడ్లర్స్ ను పోలీసులు గుర్తించారు. శనివారం రైడ్స్ లో ఓ అనుమానితుడిని గుర్తించిన పోలీసులు అతడు గోవాకు రెగ్యులర్ గా వెళుతుంటాడని నిర్ధారణకు వచ్చారు. పబ్ కు వచ్చిన వ్యక్తుల్లో ముగ్గురిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే మేనేజర్ అనిల్ , ఓనర్ అభిషేక్ రిమాండ్ లో ఉన్నారు.
పరారీలో ఉన్న మరో ఇద్దరు ఓనర్లు అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పబ్ లోకి డ్రగ్స్ ఎవరు తెచ్చారనే దానిపై ముమ్మర విచారణ సాగుతోంది.
పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులపై వరుస ఆరోపణలు, విమర్శలు రావడంతో కేసును సవాల్ గా తీసుకున్నారు. విచారణ వేగంగా చేస్తున్నారు. ఈ కేసును చేధించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.
పోలీసులు దాడి చేసిన సమయంలో పబ్ లో 125మంది యువతీ యువకులు ఇప్పటికే గుర్తించిన పోలీసులు వారంతా దర్యాప్తు పూర్తయ్యేవరకూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గతంలో కూడా పుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దందా నడిచినట్లు పోలీసులు గుర్తించారు. 125మందిలో ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు? పబ్ కు వచ్చే వారు డ్రగ్స్ కు అలవాటు పడ్డారా? పబ్ లోకి డ్రగ్స్ ఎవరి తెచ్చారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
డ్రగ్స్ కేసు కొలిక్కి వచ్చే వరకూ 125మంది పోలీసులకు అందుబాటులో ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. 125మందిలో చాలా మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారి కోసం అన్వేషిస్తున్నారు.
పోలీసులకు అందుబాటులో లేని కొందరు యువతీ యువకులను ఎలా పట్టుకోవాలనే దానిపై ఆలోచిస్తున్నారు. పోలీసులు దాడి చేసే సమయంలో 96మంది యువకులు.. 36మంది యువతులు ఉన్నారు. పోలీసులు పట్టుకున్న వారిలో చాలా మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ లో ఉన్నట్టు గుర్తించారు. పబ్ లో పనిచేస్తున్న 20 మంది స్టాఫ్ పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు పోలీసులు. 20 మందికి సంబంధించిన కాల్ డేటా రికార్డుతోపాట్ వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.